Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ టీష‌ర్ట్ ధ‌ర వింటే క‌ళ్లు బైర్లు క‌మ్మాల్సిందే..!

Vijay Deverakonda: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో ఒక చిన్న నెగిటివ్ పాత్రలో కనిపించిన ఈ టాలెంటెడ్ హీరో ఆ తర్వాత రెండు మూడు సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద తన స్థాయిని అమాంతంగా పెంచుకున్నాడు.

Vijay Deverakonda

పవన్ కళ్యాణ్ లాంటి హీరో అంటూ ఇటీవల దిల్ రాజు చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రౌడీ బాయ్స్ సినిమా లాంచ్ ఈవెంట్ కు వచ్చిన విజయ్ దేవరకొండపై దిల్ రాజు పాజిటివ్ గా కామెంట్ చేశారు. అంతేకాకుండా గతంలో అతనితో ఉన్న అనుబంధం గురించి కూడా వివరణ ఇచ్చాడు.

పెళ్లి చూపులు’, ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ తో మనోడి క్రేజ్ కొండెక్కి కూర్చుంది. రౌడీ పేరుతో ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చి యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. విజయ్ దేవరకొండ సినిమాల్లో కాకుండా బయట ఎక్కడ కనిపించిన అతడి ఫ్యాషన్ గురించి తప్పకుండ మాట్లాడు కుంటారు.తాజాగా విజయ్ ఫ్యాషన్ గురించి మరొకసారి చర్చకు వచ్చింది.

రౌడీ బాయ్స్ సినిమా సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఆ ఈవెంట్ కు విజయ్ టీషర్ట్ వేసుకుని వచ్చాడు.విజయ్ ‘జీరో టాలరెన్స్ గ్యాంగ్‌స్టర్ స్వెట్ టీషర్ట్‌లో క్యూట్‌గా కనిపించాడు. ఇండియాలో దీని రేటు రూ. 10, 500.కాస్ట్ సంగతి పక్కన పెడితే.. రౌడీ స్టార్ ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్‌లో కనిపిస్తే.. యూత్ ఆయన స్టైల్‌ని ఫాలో అయిపోతుంటారు.

ఇటీవల ఏషియన్ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి కూడా అడుగు పెట్టాడు. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుండడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.