Rakul Preet: ర‌కుల్‌కి పెళ్లి కాదు, ఆమె జైలు ఊచ‌లు లెక్క‌బెట్ట‌డం ఖాయం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Rakul Preet: రకుల్ ప్రీత్ సింగ్… అందానికికే అందం, ఆక‌ర్షించే అభిన‌యంతో ఎంద‌రో మ‌న‌సులు గెల‌చుకుంది. ఇటీవ‌ల కొండపొలం సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. గ్లామర్ దానికి తగిన నటన, అందాన్ని, ఫిట్ నెస్ ను మెయింటేన్ చేయడంలో రకుల్ తనకు తానే సాటి.

Rakul Preet

సినీ రంగంలోకి అడుగుపెట్టి యేళ్లు గడుస్తున్నా చెక్కుచెదని అందంతో అలరిస్తుంది రకుల్. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా.. వైష్ణవ్ తేజ్ లాంటి కుర్రహీరోలతో పాటు నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో జోడీ కట్టిన హిస్టరీ రకుల్ సొంతం. ఈ అమ్మ‌డు అక్టోబర్ 10న త‌న బర్త్‌డే సందర్భంగా ఓ కీలక విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

కొంత కాలంగా బాలీవుడ్‌ హీరో జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమాయాణం నడిపిన రకుల్‌ తాజాగా వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో రకుల్‌ త్వరలోనే జాకీని పెళ్లి చేసుకోబోతోందని, అందుకే తమ రిలేషన్‌షిప్‌ ఆఫీషియల్‌ చేసిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

త్వ‌ర‌లో పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న‌ రకుల్‌- జాకీ భగ్నానీల జాతకాన్ని పరిశీలించిన అనంతరం వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాకీ భగ్నానీది మకర రాశి అని, ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఇక రకుల్‌ది మిధున రాశి అని, ఆమె జాతకంలో గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబం సౌఖ్యం ఉండదని చెప్పుకొచ్చారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌- జాకీ భగ్నానీల పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్లి జరిగినా ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం కలగకపోవడం సహా న్యాయ పరమైన ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా రకుల్‌ ఓ కేసు విషయమై జైలు కెళ్లే అవకాశం ఉంది అని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

గతంలో సమంత- నాగచైతన్యల వివాహానికి సంబంధించి వేణుస్వామి చెప్పింది నిజమైంది. భార్యభర్తలుగా ఇక కొనసాగలేమంటూ చై-సామ్‌ ప్రకటించిన సం‍గతి తెలిసిందే. మరి రకుల్‌ విషయంలో వేణు స్వామి చెప్పింది జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.