Venu Swamy : రామ్ చరణ్ 80 శాతం, ఎన్టీయార్ 20 శాతమే.! ‘ఆర్ఆర్ఆర్’పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
NQ Staff - October 15, 2022 / 08:14 PM IST

Venu Swamy : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తాలూకు ప్రకంపనలు.. అటు పాజిటివ్‌గానూ, ఇటు ఇంకో కోణంలోనూ కనిపిస్తూనే వున్నాయి.
ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఆస్కార్ బరిలో నిలిపేందుకు దర్శకుడు రాజమౌళి, చిత్ర నిర్మాణ సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోపక్క ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తూనే వుంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు కూడా.! చరణ్, ఎన్టీయార్.. వెంకటేష్, శ్రీకాంత్.!
ప్రముఖ జ్యోతిష పండితుడు వేణు స్వామి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ క్రెడిట్లో 80 శాతం రామ్ చరణ్‌కి వెళితే, జూనియర్ ఎన్టీయార్‌కి కేవలం 20 శాతం మాత్రమే వచ్చిందన్నది వేణు స్వామి అభిప్రాయం.
చాన్నాళ్ళ క్రితం వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘సంక్రాంతి’ అనే సినిమా వచ్చింది. అందులో వెంకటేష్, శ్రీకాంత్, స్నేహ తదితరులు నటించారు. ఆ సినిమాతో ‘ఆర్ఆర్ఆర్’ని పోల్చుతూ, అందులో వెంకటేష్.. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్.. అదే ‘సంక్రాంతి’లో శ్రీకాంత్.. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీయార్.. అని వ్యాఖ్యానించారు వేణు స్వామి. నిజానికి, సినిమా విడుదలైన రోజే, తమ అభిమాన హీరోకి అన్యాయం జరిగిందంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.