Venu Swamy : ప్రబాస్ పెళ్లి చేసుకుంటే అంతే సంగతి.! వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.!
NQ Staff - December 28, 2022 / 10:23 PM IST

Venu Swamy : యూనివర్సల్ స్టార్‌గా కెరీర్‌లో ఉన్నత స్థాయిని అందుకున్న ప్రబాస్, పర్సనల్ లైఫ్‌లో మాత్రం రేస్‌లో వెనకబడ్డాడు. ప్రభాస్ పెళ్లి ఓ జాతీయ సమస్యగా మారిందిప్పుడు. గత పదేళ్లుగా ప్రబాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
కానీ, ఆ ముచ్చట తీరడం లేదు. ఇదిగో ప్రభాస్ పెళ్లంట.. అదిగో ప్రభాస్ పెళ్లంట.. ఆ హీరోయిన్‌తో ప్రభాస్‌కి లవ్వంట. ఈ హీరోయిన్‌తో ప్రభాస్ డేటింగ్ అంట.. అంటూ రకరకాల పుకార్లు ప్రబాస్ పెళ్లి గురించి.
కానీ, అవన్నీ తూచ్ అని కొట్టి పడేస్తూనే వున్నాడు ప్రభాస్. పెళ్లి మాటెత్తితే చాలు, సింపుల్‌గా దాటేస్తుంటాడీ బాహుబలి. ఇదిలా వుంటే, తాజాగా ప్రభాస్ పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రబాస్ ఫ్యాన్స్‌ని మరింత కలవరానికి గురి చేస్తోంది.
ప్రబాస్ పెళ్లిని ఫ్యాన్స్ మర్చిపోవల్సిందే సుమా.!
వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ సెలబ్రిటీల భవిష్యత్తును చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన జ్యోతిష్య పండితులీయన. చై, సామ్ విడాకుల ఇష్యూ తర్వాత ఈయన మరింత పాపులర్ అయిపోయారు.
ఆయన చెబితే, ఖచ్చితంగా జరుగి తీరుద్ది.. అనే నమ్మకం కలిగించేశారు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో. ఆయన ప్రబాస్‌కి పెళ్లి అచ్చి రాదనీ, కాదని ఒకవేళ పెళ్లి చేసుకుంటే అది పెటాకులై తీరుద్దని జ్యోష్యం చెప్పారట. అంతేకాదు, ప్రభాస్‌కి పెళ్లి జరిగితే, దివంగత హీరో ఉదయ్ కిరణ్‌కి పట్టిన గతే పడుతుందని నమ్మబలికారాయన.
దాంతో, ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. అసలే పెళ్లంటే ప్రభాస్ ఆమడ దూరం పారిపోతున్నాడు. ఇక వేణుస్వామిలాంటి జ్యోతిష్యులు ఇలాంటి జ్యోష్యం చెప్పారంటే, ప్రభాస్ పెళ్లిని ఫ్యాన్స్ మర్చిపోవల్సిందేనా.?