Venu Madhav: వేణు మాధ‌వ్ చనిపోయేనాటికి ఆయ‌న ద‌గ్గ‌ర ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా?

Samsthi 2210 - July 1, 2021 / 05:06 PM IST

Venu Madhav: వేణు మాధ‌వ్ చనిపోయేనాటికి ఆయ‌న ద‌గ్గ‌ర ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా?

Venu Madhav: తెలుగు తెర‌పై చెర‌గని ముద్ర వేసుకున్న ప్ర‌ముఖ క‌మెడీయ‌న్స్‌లో వేణు మాధ‌వ్ ఒక‌రు. ఆయ‌న కామెడీ ప్రేక్ష‌కుల‌కి ఎంత వినోదం అందిస్తుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్గొండ జిల్లా, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రస్థానం మొదలు పెట్టారు.

1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా నటించిన ‘సంప్రదాయం’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయనకు పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘తొలిప్రేమ’ సినిమాతో గుర్తింపు లభించింది. వేణు మాధవ్ 170కి పైగా సినిమాల్లో నటించారు. ఆది, దిల్, సింహాద్రి, సై, లక్ష్మి, ఛత్రపతి.. ఇలా పలు సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఆయ‌న చివరిగా నటించిన చిత్రం 2016లో విడుదలైన డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్.

హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి చిత్రాల్లో వేణుమాధవ్ హీరోగా కూడా నటించారు. పలు తమిళ చిత్రాల్లోనూ, తెలుగు టీవీ కార్యక్రమాల్లోనూ నటించారు. కాలేయ సంబంధిత వ్యాధితో వేణు మాధ‌వ్ మ‌ర‌ణించ‌గా ఆయ‌న చికిత్స‌కు సంబంధించి డ‌బ్బులు కూడా చెల్లించుకోలేక‌పోయాని ప్ర‌చారం చేశారు.

venu 2v

సెప్టెంబర్ 25, 2019న వేణు మాధవ్ చ‌నిపోయిన‌ప్పుడు త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ ఆసుప‌త్రి బిల్ క‌ట్ట‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వేణు మాధ‌వ్ ఆసుప‌త్రి బిల్ కూడా క‌ట్ట‌లేనంత ప‌రిస్థితిలో ఉన్నాడా అని అనుకున్నారు. అయితే వేణు మాధ‌వ్‌కి చాలా ఆస్తులు ఉన్నాయ‌నే విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చాలా ఏళ్లుగా వేణు మాధవ్ హైదరబాద్‌లోని మౌలాలిలో సెటిల్ అయిపోయాడు.

ఈసీఐఎల్‌ నుంచి మౌలాలి వరకు తనకు పది ఇళ్లు ఉన్నాయని అప్పట్లో తెలిపిన వేణు క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 10 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూములు ఉన్నాయ‌ని అన్నాడు. ఆర్ధికంగా త‌న‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని కూడా చెప్పుకొచ్చాడు. పైగా చనిపోయిన తర్వాత వేణు మాధవ్ భార్య, కొడుకులు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తెలిపారు. డబ్బుల రూపంలో కాకపోయినా స్థిరాస్థులు మాత్రం బాగానే సంపాదించాడు వేణు.

VENU 3

ఇప్పుడు వేణు మాధ‌వ్‌కి ఉన్న ఆస్తుల విలువని నేటి మార్కెట్‌తో లెక్కిస్తే వంద‌ల కోట్ల‌లో ఉంటుంద‌ని స‌మాచారం. ఇది విని నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌వుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us