VENKATESH: రిలీజ్‌కు సిద్ధంగా మూడు సినిమాలు.. వెంకీకు ఓటీటీనే శ‌ర‌ణ్య‌మా..!

ప్ర‌స్తుతం ఉన్న టాలీవుడ్ సీనియ‌ర్ హీరోస్‌లో వెంక‌టేష్ అంద‌రి క‌న్నా భిన్నంగా ముందుకు సాగుతున్నాడు. ఒక్కో సినిమా కోసం సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి స‌మ‌యం వేస్ట్ చేయ‌కుండా షూటింగ్స్‌ని వెంటనే వెంట‌నే పూర్తి చేస్తున్నాడు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలను విడుదలకు వరుసలో పెట్టేసాడు. ప్రస్తుతం వెంకీ చేతిలో తమిళ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ మూవీ రీమేక్ గా వ‌స్తున్న నార‌ప్ప‌ ఉంది. ఈ సినిమాతో పాటు హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా ఈ ఏడాది మలయాళం సూపర్ హిట్ అయినటువంటి దృశ్యం సీక్వెల్ రీమేక్ సినిమాలను సన్నద్ధం చేస్తున్నాడు.

నార‌ప్ప‌, ఎఫ్ 3, దృశ్యం 2 చిత్రాల షూటింగ్ దాదాపు పూర్త‌యింది. క‌రోనా బెడ‌ద లేక‌పోతే మూవీస్ ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా వ‌చ్చి ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని పంచేవి. మూడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కావ‌డంతో అభిమానుల‌లోను ఈ చిత్రంపై ఆస‌క్తి నెల‌కొంది. అయితే క‌రోనా వ‌ల‌న ఇప్ప‌ట్లో సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ కరోనా కారణంగా థియేట్రికల్ రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా ఓటిటి బాటపడుతున్నాయి. త్వరలోనే వెంకీ నుండి కూడా ఓ సినిమా ఓటిటి రిలీజ్ కాబోతుందని టాక్.

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం దృశ్యం 2 క‌రోనా వ‌ల‌న ఓటీటీలో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు తెలుగు దృశ్యం 2ని కూడా ఓటీటీలో విడుద‌ల చేస్తే బాగుంటుంద‌నే అభిప్రాయానికి వ‌చ్చాడ‌ట వెంక‌టేష్. దృశ్యం సీక్వెల్ ప్రారంభించిన రెండు మూడు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేసారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. అందుకే ఇప్పుడు దృశ్యం మేకర్స్ తో పాటు వెంకటేష్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. ముందుగా దృశ్యంకు ఓటిటి బాట చూపించి.. థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే నారప్ప సినిమా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారని సమాచారం. ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన రూపొందిన సినిమానే దృశ్యం-2.