Venkatesh : బ్లాక్ బస్టర్ దక్కాలని యాక్షన్ బాట పట్టిన వెంకీ మామ. సైంధవ్ తో సక్సెస్ ప్లాన్ వర్కవుటవుతుందా?

NQ Staff - January 25, 2023 / 03:56 PM IST

Venkatesh : బ్లాక్ బస్టర్ దక్కాలని యాక్షన్ బాట పట్టిన వెంకీ మామ. సైంధవ్ తో సక్సెస్ ప్లాన్ వర్కవుటవుతుందా?

Venkatesh : ఎన్ని జనరేషన్స్ మారినా, ఎంత మంది స్టార్సొచ్చినా ఫ్యామిలీ ఆడియెన్సుకి ఫేవరేట్ హీరో అంటే యునానిమస్ గా విక్టరీ వెంకటేష్ పేరే వినిపిస్తుంది. నవ్వించినా, ఏడిపించినా, లవ్ స్టోరీలతో ఎంటర్టెయిన్ చేసినా వెంకీ మామ స్టయిలే వేరు. కానీ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఆడియెన్సుని అలరించలేక డీలాపడ్డాడు వెంకటేష్.

పేరులో ఉన్న విక్టరీ బాక్సాఫీస్ దగ్గర రావడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. ఎఫ్ టూ హిట్ తర్వాత మరో సక్సెస్ అంటూ లేకుండా పోయింది. దాంతో ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీలు ఫాలో అవుతున్న సక్సెస్ జానర్లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ ప్రాజెక్టులే చేయడానికి ఫిక్సయ్యాడు.

రీమేక్ ప్రాజెక్టులతో హిట్ కొట్టడంలో వెంకీకున్న రికార్డే సపరేటు. ఆ సెంటిమెంటు కలిసొచ్చేలా, మరోవైపు యాక్షన్ ఎలిమెంట్సుతోనూ ఆడియెన్సుని ఫిదా చేయడానికి రానా నాయుడు అనే సిరీసుతో రెడీ అయ్యాడు వెంకీ. రే డోనోవన్ అనే హాలీవుడ్ సిరీసుని బేస్ చేసుకుని వస్తోన్న లేటెస్ట్ సిరీసిది. రానా దగ్గుబాటి, వెంకటేష్ కలిసి నటిస్తున్న సిరీస్ కావడంతో అనౌన్సయిన నాటినుంచే అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ చూశాక ఈసారి యాక్షన్ సీన్సుతో బాబాయ్, అబ్బాయిలిద్దరూ ఇరగదీసేలా ఉన్నారుగా అంటూ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

ఇక తాజాగా సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్థమవుతున్నాడు వెంకటేష్. హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఇది. లేటెస్టుగా రిలీజైన గ్లింప్స్ చూశాక ఈ ప్రాజెక్ట్ కూడా ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీనే అన్న ఫీల్ కలుగుతోంది.

ఇప్పటికే హిట్, హిట్ టూ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ సపరేట్ స్టయిల్ అండ్ మార్క్ క్రియేట్ చేసుకున్న శైలేష్ కొలను డైరెక్షన్లో ఈ మూవీ వస్తుండడంతో పాజిటివ్ వైబ్స్ క్రియేటవుతున్నాయి. మరోవైపు అన్నీ కుదిరితే రానున్న రోజుల్లో శైలేష్ హిట్ వర్స్ లో వెంకీ కూడా జాయిన్ అవుతాడా? అన్న డిస్కషన్స్ కూడా సోషల్మీడియాలో స్టార్టయిపోయాయి.

Venkatesh Will Hit Record with Remake Projects

Venkatesh Will Hit Record with Remake Projects

నారప్ప లాంటి రీమేక్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేసినా పాజిటివ్ టాక్ దక్కకపోవడం, ఎఫ్ త్రీ లాంటి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టెయినర్ తీసినా సరిగ్గా ఆడకపోవడంతో యాక్షన్ మూవీస్ పైనే ఫోకస్ పెట్టడం బెటరనుకున్నాడేమో వెంకీ. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ కి ప్రేక్షకులొచ్చి థ్రిల్ ఫీలవ్వాలంటే యాక్షన్ జానరే బెటరని ట్రెండును ఫాలో అవడానికే ఫిక్సయినట్టున్నాడు.

కమల్ హాసన్ లాంటి బడా స్టార్లు కూడా విక్రమ్ లాంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలతోనే స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేయడంతో వెంకీ సరైన విక్టరీ కోసం ఇదే రూట్ బెటరని ఫీలయినట్టున్నాడు. మరి సైంధవ్ తో తన స్ట్రాటెజీ సక్సెసవుతుందా? అటు రానా నాయుడుతోనూ ఓటీటీలో బడా హిట్ దక్కుతుందా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us