F3: బాక్సాఫీస్‌ని ఊచ‌కోత కోసిన ఎఫ్ 3.. వెంకీ, వ‌రుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

NQ Staff - May 28, 2022 / 01:26 PM IST

F3: బాక్సాఫీస్‌ని ఊచ‌కోత కోసిన ఎఫ్ 3.. వెంకీ, వ‌రుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

F3: విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ సందేశ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం ఎఫ్ 3. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మే 27న విడుద‌ల కాగా, ఈ మూవీ ఊహించినట్టే భారీ కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లను నమోదు చేసింది.

Venkatesh-Varun Tej Starrer F3 Opens with Huge Box Office Collection

Venkatesh-Varun Tej Starrer F3 Opens with Huge Box Office Collection

తొలి రోజు ఈ చిత్రానికి వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. ఎఫ్ 3 చిత్రం నైజాంలో 4.06 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో 1.26 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.18 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 16 లక్షల హైర్స్‌తో కలిపి 76 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 55 లక్షల హైర్స్‌తో 94 లక్షలు, గుంటూరు జిల్లాలో 32 లక్షల హైర్స్‌తో 88 లక్షలు, కృష్ణా జిల్లాలో 66 లక్షలు, నెల్లూరు జిల్లాలో 14 లక్షల హైర్స్‌తో 61 లక్షలు రాబట్టింది. దాంతో 1.17 కోట్ల హైర్స్‌తో 17 కోట్ల గ్రాస్, 10 కోట్ల షేర్ సాధించింది.

ఈ చిత్రం కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి 85 లక్షలు, ఓవర్సీస్‌లో 2.15 కోట్ల (550k) రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 23 కోట్ల గ్రాస్, 13.35 కోట్ల షేర్‌ను తొలి రోజున నమోదు చేసింది. 64.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో కలెక్షన్ల పర్వాన్ని ప్రారంభించింది. తొలి రోజున 13.35 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 51.15 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

ప్రేక్షకులకు ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతున్నారు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమాతో పలకరించారు అనిల్ రావిపూడి. .ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటించ‌గా, అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది.

ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. ఈ శుక్రవారం ఈ సినిమాను యూఎస్‌లో ప్రపంచ వ్యాప్తంగా 1400కు పైగా విడుదలైంది. మొత్తంగా మొదటి రోజు ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింద‌నే చెప్పాలి.

Read Today's Latest బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us