Venkatesh: సినిమాల్లేవు, ఖాళీగా ఉన్నాన‌న్న వెంక‌టేష్‌.. ఆశ్చ‌ర్య‌పోతున్న అభిమానులు

Venkatesh: విక్టరీ వెంక‌టేష్ ఈ వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తుంటారు. ఇటీవ‌లి కాలంలో వెంక‌టేష్ ఎక్కువ‌గా రీమేక్‌లు చేస్తున్నాడు. చివరిగా నారప్ప చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయ‌గా, ఈ చిత్రం నిరాశ‌ప‌ర‌చింది. అయితే వెంక‌టేష్ న‌టించిన దృశ్యం 2 చిత్రం నవంబ‌ర్ 25న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో మీడియాతో ముచ్చ‌టించారు వెంకీ.

TheNewsQube-
venkatesh on-drushyam-2-movie-promotions3
venkatesh on-drushyam-2-movie-promotions3

మీడియాతో జోకులు వేసిన వెంకీ మామ.. కొన్ని నిజాలు పరోక్షంగా చెప్పుకొచ్చాడు. థియేటర్లో వేసినా, ఓటీటీల్లో సినిమా వేసినా చూసే వారు చూస్తారు.. ఎంజాయ్ చేస్తారు అని అన్నాడు. ఇక తన తదుపరి చిత్రాల గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన చేతిలో సినిమాలు లేవని, ఖాళీగా ఉన్నాను అంటూ కౌంటర్లు వేశాడు. దీంతో మీడియా ప్రతినిధులంతా నవ్వేశారు.

నిజంగానే చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేవని, ఇంకా కథలు రెడీ కాలేదని, అందుకే ఖాళీగా ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఎఫ్ 3 సినిమా ముగింపు దశలో ఉందని అన్నాడు. రానాతో చేయబోయే ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉందని అన్నాడు. తరుణ్ భాస్కర్ ఇంకా కథను రెడీ చేసే పనిలోనే ఉన్నాడని అన్నాడు.

మిగతా వాళ్లు కూడా కొన్ని కథలు రెడీ చేస్తున్నారు. కానీ ఇంకా ఏవీ కూడా పూర్తి కాలేదని అన్నాడు. మొతానికి ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉన్నానని చెప్పేశాడు. కథలు వచ్చినప్పుడు చేద్దాం, లేనప్పుడు ఖాళీగా ఉందాం. ప్రపంచం తిరుగుదాం, ధ్యానం చేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. దానికంటే ఏం ఉంటుంది?

venkatesh on-drushyam-2-movie-promotions1
venkatesh on-drushyam-2-movie-promotions1

రీమేక్స్ ఎక్కువ‌గా చేస్తుండ‌డంపై స్పందించిన వెంక‌టేష్‌… ఇలాంటి కథలు ఎవ్వరి దగ్గరికీ ఎందుకు వెళ్లలేదు? ‘నారప్ప’ని తెలుగులో మరెవ్వరూ చేయలేదు కదా? నేనే చేశానంటే కారణం ఏమిటి?జీవితంలో ఎవ్వరూ ఏ విషయం గురించి మరీ లోతుగా వెళ్లకూడదు. ఇమేజ్‌ అని మీరంటున్నారు. నేనెప్పుడూ ఇమేజ్‌ గురించి ఆలోచించను. నా దగ్గరికి అదెందుకు రాలేదు, ఇదెందుకు రాలేదని అటూ ఇటూ ఎప్పుడూ చూడను. నా దగ్గరికి వచ్చింది తీసుకోవడమే నాకు తెలుసు. అదృష్టంకొద్దీ ఈ రంగంలోకి వచ్చాను. ప్రేక్షకుల అభిమానం దొరికింది. ఎప్పటికప్పుడు కొత్త కథలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాఅని అన్నారు వెంక‌టేష్‌.