Narappa Review: మూవీ రివ్యూ : వెంకీ షో ‘నారప్ప’

Narappa Review: తమిళంలో ధనుష్‌ నటించిన అసురన్ కు నారప్ప అధికారిక రీమేక్. ఒరిజినల్‌ వర్షన్ లో ధనుష్ తరహాలో నటించడం.. ఆ తరహా కాస్ట్యూమ్స్ సాధ్యమేనా అంటూ కొందరు రీమేక్ విషయంలో పెదవి విరిచారు. ఎన్నో రీమేక్ ల్లో నటించి సక్సెస్ లు దక్కించుకున్న ఘనత వెంకటేష్‌ కు ఉంది. అలాంటి వెంకటేష్ చేతిలో పడ్డ నారప్ప సినిమా సక్సెస్‌ అయ్యిందా.. కమర్షియల్‌ ఎలిమెంట్స్ లేకుండా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉందా? లేదా ? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

Venkatesh Narappa Movie Review Rating
Venkatesh Narappa Movie Review Rating

కథ : నారప్ప (వెంకటేష్‌) కుటుంబంకు ఉన్న మూడు ఎకరాల భూమిని లాక్కునేందుకు పక్క భూమి ఆసామి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చావుకైనా సిద్దమే కాని భూమి ఇచ్చేందుకు నిరాకరించడంతో నారప్ప కుటుంబంపై ప్రమాదంలో పడుతుంది. ఆ ప్రమాదం ఏంటీ.. నారప్ప గతం గురించిన ఆసక్తికర విషయాలు.. తన కుటుంబంను నారప్ప ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా కథ.

నటీనటుల నటన : వెంకటేష్‌ వన్ మ్యాన్ షో అనడంలో సందేహం లేదు. ఒక బాధ్యత గల తండ్రిగా అద్బుతంగా నటించాడు. వెంకటేష్‌ నారప్ప పాత్రకు ప్రాణం పోశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నారప్ప పాత్ర కోసం వెంకటేష్‌ ఎంతగా కష్టపడ్డాడో సినిమా చూస్తుంటే అర్థం అవుతుంది. తాగిన సందర్బంలో సన్నివేశాలు.. తన కొడుకులపై ప్రేమ చూపించే సమయంలో వెంకటేష్ నటన మరో లెవల్. ఇప్పటి వరకు వెంకటేష్‌ ఎన్నో పాత్రల్లో కనిపించారు కాని ఇది చాలా ప్రత్యేకంగా ఆయన కెరీర్‌ లో నిలుస్తుందనడంలో సందేహం లేదు. సెంటిమెంట్.. ఎమోషనల్ అన్ని రకాలుగా వెంకటేష్‌ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ.

ప్రియమణి నటనతో ఆకట్టుకుంది. ఆమె డీగ్లామర్‌ లుక్ లో ముగ్గురు పిల్లల తల్లిగా నటించేందుకు ఒప్పుకోవడం నిజంగా అభినందనీయం. నారప్ప భార్య సుందరమ్మ పాత్రకు ప్రియమణి కూడా ప్రాణం పోసింది. రెబల్‌ గా ఆమె నటించిన కొన్ని సీన్స్ సూపర్‌. నారప్ప పెద్ద కొడుకు పాత్రలో కనిపించిన కార్తీక్ రత్నం మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఉన్నది కొద్ది సమయమే అయినా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. రాజీవ్ కనకాల మరియు నాజర్ లు కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన వారు కూడా వారి పాత్రల పరిధిలో నటించారు.

టెక్నీషియన్స్ : పీరియాడిక్ డ్రామా అయిన ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులను అప్పటి కాలంకు తీసుకు వెళ్లే విధంగా సినిమాటోగ్రఫీ ఉంది. పలు సీన్స్ లో కెమెరా పనితనం బాగుంది. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది. అది కూడా మామూలుగానే ఉంది. అయితే బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. ఒరిజినల్‌ వర్షన్‌ నుండి బీజీని తీసుకు వచ్చారు. సినిమా కథనం ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న సమయంలో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందులో లీనం చేసే విధంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా ను ఎక్కువగా మార్చకుండా కొన్ని సున్నితమైన విషయాలను టచ్‌ చేయకుండా సింపుల్ గా కానిచ్చేశాడు. ఒరిజినల్ వర్షన్ లో ఉన్న కొన్ని విషయాలను వదిలేసినా కూడా తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా సినిమాను తీసుకు రావడంలో శ్రీకాంత్‌ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా బాగానే ఉన్నాయి. రెండు మూడు సీన్స్ సీన్స్ విషయంలో ఇంకాస్త కత్తెరింపు అవసరం.

Venkatesh Narappa Movie Review Rating
Venkatesh Narappa Movie Review Rating

విశ్లేషణ : తమిళ అసురన్‌ సినిమాలో దళితులపై అప్పట్లో జరిగిన అకృత్యాలను నిర్మొహమాటంగా చూపించారు. కాని నారప్ప సినిమాలో మాత్రం ఆ విషయం ఎక్కువగా ప్రస్థావించకుండా డబ్బున్న వాడికి పేద వాడికి మద్య జరిగే గొడవగా మాత్రమే ఈ సినిమాలో చూపించారు. తెలుగు పరిస్థితులకు అనుగుణంగా దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల స్క్రిప్ట్‌ ను మార్చేశాడు. ఫ్ల్యాష్‌ బ్యాక్ సన్నివేశాలపై ఎక్కువ దృష్టి పెట్టకుండానే కానిచ్చేశారు. వెంకటేష్ పై పూర్తి ఫోకస్ పెడుతూ సినిమా మొత్తం ఆయన చుట్టు తిరిగేలా ఎక్కడ వివాదం లేకుండా.. కమర్షియల్‌ ఎలిమెంట్స్ లేకున్నా బోర్‌ కొట్టకుండా స్క్రీన్‌ ప్లే ను దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల నడిపించడంలో సఫలం అయ్యాడు. సినిమా ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. వెంకీ నటన విషయంలో ఎలాంటి డౌట్‌ లేదు. కాని రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం నారప్ప కు పెదవి విరిచే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు కమర్షియల్ సినిమాలు కామెడీ సినిమాలేనా అనుకునే వారికి మాత్రం నారప్ప ఒక మంచి సినిమా.

ప్లస్‌ పాయింట్స్ :

  • నారప్పగా వెంకటేష్‌,
  • ఫ్యామిలీ సన్నివేశాలు,
  • ఎమోషనల్‌ సీన్స్‌.
  • ఇంటర్వెల్‌ కు ముందు సన్నివేశాలు

మైనస్‌ పాయింట్స్ :

  • కమర్షియల్‌ ఎలిమెంట్స్ లేక పోవడం,
  • కొన్ని సీన్స్‌ మరీ మాస్ గా ఉన్నాయి
  • ఒరిజినల్‌ కంటెంట్‌ కు మార్పులు

చివరగా: టాలీవుడ్ లో మరో ప్రత్యేకమైన సినిమా ‘నారప్ప’. అందరికి కాకున్నా కొందరికి అయినా నచ్చుతాడు

రేటింగ్‌ : 2.75/5.0