Veera Simhareddy : అన్ స్టాపబుల్ లో వీర సింహారెడ్డి.. అఖండ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
NQ Staff - January 10, 2023 / 08:29 AM IST

Veera Simhareddy : నందమూరి బాలకృష్ణ ఎక్కడ చూసినా కూడా తన టాక్ షో అన్ స్టాపబుల్ తో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కనుక ఆయన నటించిన వీరసింహారెడ్డి సినిమాను ఆ షో లో పబ్లిసిటీ చేస్తే బాగుంటుందని అంతా భావించారు.
అన్నట్లుగానే బాలకృష్ణ తన సినిమాను తన షోలో పబ్లిసిటీ చేస్తున్నాడు. గతంలో అఖండ సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా అన్ స్టాపబుల్ లో జరిగాయి. ఇప్పుడు అదే విధంగా వీరసింహారెడ్డి సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా బాలయ్య టాక్ షో లో జరుగుతున్నాయి.
ఆ కారణంగా అఖండ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను రూపొందించినట్లుగా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా నమ్మకంతో చెబుతున్నారు.
ఆహా ఓటీపీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో కి సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ వారంలోనే ఎపిసోడ్ యొక్క స్ట్రీమింగ్ ఉంటుందని సమాచారం అంది.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల కోసం బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. చిరంజీవి హాజరవుతాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని తర్వాత వెళ్లడైంది.