Veera Simhareddy : అక్కడ వీర సింహారెడ్డి స్పష్టమైన ఆధిపత్యం
NQ Staff - January 5, 2023 / 10:21 PM IST

Veera Simhareddy : ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా ఒక్కరోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాలేదు, కానీ అమెరికా, ఆస్ట్రేలియా మరియు యూకే లో ఈ సినిమా ల యొక్క అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. మూడు చోట్ల కూడా వీర సింహారెడ్డి సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ అత్యధికంగా నమోదు అయినట్లుగా డిస్ట్రిబ్యూటర్స్ పేర్కొన్నారు.
అన్నిచోట్ల బాలయ్య అభిమానుల సందడి కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా తో మరో సారి భారీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ నందమూరి అభిమానులు ధీమాతో ఉన్నారు.
అందుకే అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా లో బాలకృష్ణ కు జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. తమన్ సంగీతాన్ని అందించాడు.