Jagan Mohan Reddy : వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘వీర సింహా రెడ్డి’ షాక్.!
NQ Staff - January 6, 2023 / 10:58 PM IST

Jagan Mohan Reddy : నేరుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘వీర సింహా రెడ్డి’ సూపర్ షాక్ ఇచ్చాడు. ఆ సినిమాలోని డైలాగ్ అంతలా వైరల్ అవుతోంది. ట్రైలర్ రావడంతో ఇప్పడంతా సినిమా గురించి కంటే, అందులో బాలయ్య చెప్పిన డైలాగ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు.
‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ, ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు..’ అంటూ నందమూరి బాలకృష్ణ, ‘వీర సింహా రెడ్డి’ కోసం ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.
వైఎస్ జగన్ని టార్గెట్ చేసిన బాలకృష్ణ..
కొన్నాళ్ళ క్రితం ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా వైఎస్ జగన్ ప్రభుత్వం మార్చిన విషయం విదితమే.
‘చరిత్ర సృష్టించిన..’ అన్న మాట, స్వర్గీయ ఎన్టీయార్ని ఉద్దేశించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఇక, సంతకంతో పేరు మార్చడం అనేది, ఎన్టీయార్ పేరుతో అంతకు ముందున్న సంక్షేమ పథకాలు కావొచ్చు, ఎన్టీయార్ పేరుతో వున్న ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారం కావొచ్చు.. వీటి మార్పుని వైఎస్ జగన్ సర్కారు చేపట్టడంపై ‘వీర సింహా రెడ్డి’ సినిమా ద్వారా బాలకృష్ణ షాకింగ్ సెటైర్ వేసినట్లే అర్థం చేసుకోవాలేమో.!