Vedika : బికినీలో బాలయ్య హీరోయిన్ అందాల బీభత్సం.! కుర్రకారులో కాక రేపుతోన్న వేదిక.!

NQ Staff - September 28, 2022 / 09:03 PM IST

Vedika : బికినీలో బాలయ్య హీరోయిన్ అందాల బీభత్సం.! కుర్రకారులో కాక రేపుతోన్న వేదిక.!

Vedika : అప్పుడెప్పుడో ‘విజయ దశమి’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ వేదిక. అందానికీ అమ్మడు వేదికే. కానీ, అవకాశాలకే ఆమడ దూరంగా మిగిలిపోయింది ఈ మహారాష్ట్ర బ్యూటీ.

అందంలోనూ, అందాల ఆరబోతలోనూ నేటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు వేదిక. కానీ, ఎందుకో వేదికను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇటీవలే వేదిక సినిమాల్లో కాస్త యాక్టివ్ అయ్యిందని చెప్పొచ్చు. అందుకు కారణం నందమూరి నటసింహం బాలయ్య.

ముడి పెట్టేసి.. బికినీలా చుట్టేసి.!

ఆయన సినిమా ‘రూలర్’లో వేదికకు హీరోయిన్‌గా ఛాన్సిచ్చాడు. దాంతో, వేదిక గురించి మళ్లీ అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ వెంటనే నాగార్జున నటించిన ‘బంగార్రాజు’లోనూ చిన్న అతిథి పాత్రలో వేదిక నటించింది.

‘బంగార్రాజు’తో కలిసి ఓ పాటలో గ్లామరస్‌గా ఆడి పాడింది ఈ సినిమాలో వేదిక. కానీ, అది చాలదు. ఇక సోషల్ మీడియాలో అయితే, వేదిక ఓ హాట్ సెన్సేషన్. వేదిక చేసే స్కిన్ షోని సినిమా జనం పట్టించుకోకపోయినా, నెటిజనం మాత్రం ఎప్పటికప్పుడు ఫాలో చేస్తూనే వుంటారు.

ఆ నెటిజనాన్ని శాటిస్‌ఫై చేసేందుకు వేదిక కొత్త కొత్తగా అందాల దాడికి దిగుతూనే వుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ బికినీలో బోటు షికారు చేసింది వేదిక. బికినీ అంటే ఏం లేదండీ బాబూ. బ్లాక్ కలర్ డిజైన్ పీస్‌ని రెండు ముక్కలు చేసి, టాప్ అండ్ బాటమ్ కవర్ చేసిందంతే. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ టూ పీస్ బికినీలోనూ వేదిక అందం కెవ్వు కేకో కేక.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us