Varun Tej-Lavanya Tripati Marriege : వరుణ్-లావణ్య పెళ్లికి మెగా ఫ్యామిలీని ఒప్పించింది ఆమెనే అని మీకు తెలుసా..?
NQ Staff - August 13, 2023 / 07:54 PM IST

Varun Tej-Lavanya Tripati Marriege : మెగా ఫ్యామిలీలో మరికొన్ని రోజుల్లో పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. ఎవరివో కాదు.. వరుణ్ తేజ్ వి. ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాను ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. కాకపోతే చాలా సింపుల్ గా చేసుకున్నాడు.
ఈ నెలలో లేదంట వచ్చే నెలలో వీరిద్దరి వివాహం జరగబోతోంది. రాజస్థాన్ లేదంటే ఇటలీలో వీరి పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. అయితే మామూలుగా మెగా ఫ్యామిలీ ప్రేమ వివాహాలకు పెద్దగా ఒప్పుకోదు. వరుణ్ తేజ్ విషయంలో కూడా మొదట ఇదే జరిగింది. నాగబాబు ఒక హీరోయిన్ ను తన కోడలిగా తెచ్చుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు.
తన పెళ్లికంటే ముందే..
కానీ నిహారిక వల్ల ఇది జరిగిందంట. అవును ఇప్పుడు ఇదే విషయం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. మెగా డాటర్ నిహారిక పట్టుబట్టి మరీ వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లికి ఒప్పించిందంట. ఆమె పెళ్లికంటే ముందే వీరి మ్యాటర్ ను ఇంట్లో వారితో చెప్పి ఒప్పించింది నిహారిక. అందుకే తన పెళ్లికి లావణ్య ఒక్కతే ఇండస్ట్రీ నుంచి వచ్చింది.
ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అన్న పెళ్లిని చేయడానికి అందరినీ ఒప్పించిన ఈ బ్యూటీ.. తన పెళ్లిని మాత్రం పెటాకులు చేసుకుంది. ఆమె ఇప్పుడు తన భర్త చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.