Varun Tej And Lavanya Tripathi : వరుణ్-లావణ్య పెళ్లి పత్రిక ఖరీదు రూ.80 వేలు.. అక్కడే వివాహం..!
NQ Staff - June 9, 2023 / 12:43 PM IST

Varun Tej And Lavanya Tripathi : ఇప్పుడు టాలీవుడ్ లో వరుణ్-లావణ్యల పేర్లు మోత మోగుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే వీరిద్దరి గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెండ్లి చేసుకుంటారని రక రకాలుగా వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఎన్నడూ ఎవరూ స్పందించలేదు. కానీ సైలెంట్ గా వాటినే నిజం చేసేసింది ఈ జంట.
ఈ రోజు వీరిద్దరూ వరుణ్ తేజ్ ఇంట్లో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారి పెండ్లికి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వీరిద్దరి పెండ్లి చాలా గ్రాండ్ గా చేయబోతున్నారంట. ఎంతలా అంటే.. పెళ్లి పత్రికకే ఏకంగా రూ.80వేలు ఖర్చు పెడుతున్నారంట.
అతిథులకు ఇచ్చే వెడ్డింగ్ కార్డును బంగారు పూతతో చేయిస్తున్నారంట. రాజస్థాన్ లోని ఉదయ్ ఘడ్ ప్యాలెస్ లో వీరి వివాహం గ్రాండ్ గా చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారంట. పెండ్లి అక్కడ చేసి.. హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు.
ఇక పెళ్లికి అతికొద్ది మంది సన్నిహితులను మాత్రమే పిలవబోతున్నారు. కానీ రిసెప్షన్ కు మాత్రం ఇటు సినీ ప్రముఖులు, అటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. వరుణ్ పెళ్లి విషయంలో అన్నీ గ్రాండ్ గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు నాగబాబు. చిరంజీవి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు.
ఉదయ్ ఘడ్ ప్యాలెస్ కు వెళ్లేందుకు స్పెషల్ ఫ్లైట్లు కూడా ఏర్పాటు చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఎంతైనా మెగా వారసుడు పెళ్లి అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అందుకే రిచ్ నెస్ ఎక్కడా తగ్గకుండా చూస్తున్నారు. అటు మెగా హీరోలు తమ సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చేసి వరుణ్ పెండ్లి వేడుకలకు రెడీ అవుతున్నారు.