Varun Tej Lavanya Tripathi : వరుణ్-లావణ్య ఎంగేజ్ మెంట్ ఫొటోలు చూశారా.. ఎంత అందంగా ఉన్నారో..!
NQ Staff - June 10, 2023 / 08:35 AM IST

Varun Tej Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ నిన్న వైభవంగా జరిగింది. వరుణ్ తేజ్ ఇంట్లో జరిగిన ఈ వేడుకకు కేవలం మెగా ఫ్యామిలీ, అటు లావణ్య ఫ్యామిలీ మాత్రమే హాజరైంది. బయట వారికి ఆహ్వానం పంపలేదు. వీరిద్దరి ప్రేమ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఎవరూ స్పందించలేదు.

Varun Tej Lavanya Tripathi Engagement Beautiful Photos
ఒకానొక సమయంలో లావణ్య తనకు అసలు ఇప్పట్లో పెండ్లి చేసుకునే ఉద్దేశమే లేదని చెప్పింది. కానీ చివరకు అవన్నీ ఉత్తవే అని తేలిపోయింది. తమ ఎంగేజ్ మెంట్ తో వాటికి చెక్ పెట్టేసింది ఈ జంట. ఇక తాజాగా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Varun Tej Lavanya Tripathi Engagement Beautiful Photos
వరుణ్-లావణ్య సంప్రదాయ బట్టల్లో చాలా అందంగా మెరిశారు. లావణ్య చీరలో కుందనపు బొమ్మలా కనిపిస్తోంది. వరుణ్ పైజామా వేసుకుని సంప్రదాయంగా కనిపిస్తున్నాడు. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. వీరిద్దరి జంటను చూసి అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక వీరి పెండ్లి కొన్ని నెలల తర్వాత జరగబోతోంది.

Varun Tej Lavanya Tripathi Engagement Beautiful Photos
ఇటలీలో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది కూడా అక్కడే. కాబట్టి అక్కడే పెండ్లి చేసుకోవాలని భావిస్తున్నారంట. లేకపోతే రాజస్థాన్ లోని ఉదయ్ ఘడ్ ప్యాలెస్ లో జరిగే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరూ ఎక్కడ చేసుకుంటారో.