Varun tej: వ‌రుణ్ తేజ్ చెడ‌గొట్టిన చిరంజీవి.. మెగా సెలబ్రేష‌న్స్ అదుర్స్

Varun tej: హిందువులు “పెద్ద పండగ” అని పిలుచుకునే సంక్రాంతి నాలుగు రోజుల సందడి. భోగి.. భోగభాగ్యాలను ఇవ్వాలని, సంక్రాంతి తమ జీవితాల్లో కాంతిని నింపాలని, కనుమ కష్టాలు తీర్చాలని కోరుకుంటారు ఇక్కడి జనం. దీనికోసం సుదూర ప్రాంతాల్లో నివసించే వలస పక్షులు ఇళ్లకు చేరుకుంటారు.

varun tej celebrating festival with his family
varun tej celebrating festival with his family

జిల్లాలోని కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఏడాది భోగి సంబరాలను బాలకృష్ణ తన భార్య వసుంధరతో కలిసి అక్క బావ దగ్గుబాటి పురందరేశ్వరి, వెంకటేశ్వరరావుల ఇంట్లో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో లోకేశ్వరి, ఉమామహేశ్వరి సహా బంధువులు పాల్గొన్నారు. ఈ ఏడాది భోగి పండగను తన అక్క ఇంట్లో జరుపుకోవడం కోసం బాలకృష్ణ తన భార్య తో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు.

రోజా కూడా త‌న ఫ్యామిలీతో వేడుకుల జ‌రుపుకుంటుంది. మెగా ఫ్యామిలీ కూడా సంక్రాంతి సంబురాల‌ను జ‌రుపుకుంటూ అందుకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగ వ‌రుణ్ తేజ్.. సాయి ధ‌ర‌మ్, చిరంజీవి, వైష్ణవ్ తో పాటు త‌న కుటుంబ స‌భ్యులతో క‌లిసి చేసిన సంద‌డికి సంబంధించిన వీడియో షేర్ చేశాడు.

ఇందులో చిరంజీవి, వ‌రుణ్ తేజ్ దోశెలు వేస్తుండ‌గా, వ‌రుణ్ దోసె మంచిగా వ‌స్తుంద‌ని చిరంజీవి చెడ‌గొడుతుండ‌డం ఫన్నీగా అనిపించింది. ఈ వీడియో తెగ అల‌రిస్తుంది. మొత్తానికి భోగి పండుగ‌ని మెగా ఫ్యామిలీ చాలా సంతోషంగా జ‌రుపుకుంద‌ని స‌మాచారం.

సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల‌లో హడావుడే హడావుడి. కొత్త బట్టల దుకాణాలు, రోడ్లు, టౌన్లు ఏవీ ఖాళీగా ఉండవు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నెలకొనే సందడి అంతా ఇంతా కాదు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లే జనమంతా ఇళ్లకు చేరి గ్రామాలు నిండుగా కళకళలాడతాయి.

సంక్రాంతి పండగ అంటే చాలు.. భోగి పిడకల సేకరణలో నిమగ్నమయ్యే చిన్నారులు.. డూడూ బసవన్నల సయ్యాటలు… ఇంటి ముంగిట అందమైన ముగ్గులు వేయడంలో హ్యాపీగా గడిపే మహిళలు.. ధాన్య రాశులకు పూజలు చేస్తూ కనిపించే రైతులు.. అంతా ఓ కళాత్మకమైన భావన కనిపిస్తుంది.