Varun Tej and Lavanya wedding date : వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి జరిగేది ఆ రోజే.. కానీ ఇండియాలో మాత్రం కాదంట..!
NQ Staff - July 21, 2023 / 01:26 PM IST

Varun Tej and Lavanya wedding date : వరుణ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొదటి నుంచి మెగా ఫ్యామిలీలో డిఫరెంట్ సినిమాలు చేస్తున్న హీరోగా ఆయనకు పేరుంది. పైగా తాను చేసే ప్రతి సినిమా కొత్తదనాన్ని అందించాలని అనుకుంటాడు. అందుకే ఆయన ఆ పాత్రలో లీనం అయిపోతూ ఉంటాడు.
ఇక కెరీర్ పరంగా యావరేజ్ హీరోగా ఉన్న ఆయన.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన ప్రేమించిన లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ ఫిక్స్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తున్నారు. రీసెంట్ గానే ఫ్యారిస్ కు వెళ్లి వచ్చారు.
ఆ తేదీన ఫిక్స్..
అంతే కాకుండా మొన్న కాఫీ డేట్ కు కూడా వెళ్లారు. ఇద్దరూ ఈ పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే వీరిద్దరి వివాహం అతి త్వరలోనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల ఆగస్టు 24వ తేదీన వీరి వివాహం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వీరి వివాహం ఇండియాలో కాదంట.
ఇటలీలో చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఓ ప్రాచీన కోటలో వీరి వివాహం జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వరుణ్-లావణ్య దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు దగ్గర పడ్డాయంట. కాగా వీరి వివాహం అతికొద్ది మంది సన్నిహితుల నడుమ జరగబోతున్నట్టు తెలుస్తోంది.