Varun Tej And Lavanya Tripathi Wedding Cost Details : వరుణ్ – లావణ్య పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
NQ Staff - July 26, 2023 / 06:34 PM IST

Varun Tej And Lavanya Tripathi Wedding Cost Details :
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ చాలా సైలెంట్ గా ఇన్నోసెంట్ గా కనిపిస్తూ ఉంటాడు. వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నాడు.. లావణ్య త్రిపాఠి ని ప్రేమిస్తున్నాడు… ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చిన సమయంలో అంతా కూడా షాక్ అయ్యారు. ఇది నిజమా.. నిజంగా నిజమా అంటూ చాలా మంది నోరు వెళ్లబెట్టారు.
మెగా హీరో వరుణ్ తేజ్ ఔను నేను ప్రేమలో ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. అంతే కాకుండా గత నెలలో లావణ్య త్రిపాఠి చేతికి ఉంగరం పెట్టి మరీ వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి అనేది ఇప్పటికే వీరు షేర్ చేసిన ఫోటోలు వీడియోలను చూస్తే అర్థం అవుతోంది.
ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్
వివాహ నిశ్చితార్థం నెల రోజులు దాటింది. ఇప్పటి వరకు పెళ్లి ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఇటలీ లో పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టికెట్ల బుకింగ్.. ప్రత్యేక విమానం బుకింగ్ జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి. డేట్ విషయంలో గందరగోళం నెలకొంది. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది.
ఇక ఇటలీ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగబోతుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో అత్యంత వైభవంగా హైదరాబాద్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేయబోతున్నారట. ఈ మొత్తం వివాహ వేడుకకు గాను మెగా ఫ్యామిలీ దాదాపుగా 20 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో నిహారిక పెళ్లికి కూడా నాగబాబు భారీగా ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు లావణ్య ఫ్యామిలీ.. వరుణ్ ఫ్యామిలీ కలిసి ఈ ఖర్చు పెట్టబోతున్నారట.