అది చూసి షాకైనట్టున్నాడు.. వరుణ్ సందేశ్ వీడియో వైరల్
NQ Staff - December 2, 2020 / 02:03 PM IST

ఒక్కోసారి కొన్ని వింతలు జరుగుతుంటాయి. అది ఎలా సాధ్యమైందని ఆలోచించే బధులు.. వాటిని చూస్తు ఎంజాయ్ చేయాల్సిందే. తాజాగా వరుణ్ సందేశ్ కూడా అలాంటి ఓ వింతను చూసి ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక వరుణ్ సందేశ్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాడు. షోతో వచ్చిన క్రేజ్‌ను నిలుపుకునేందుకు సోషల్ మీడయాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటాడు.

Varun Sandesh shares Funny Video
అలా వరుణ్ సందేశ్ వితికా షెరు చేసే రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. అంతే కాకుండా బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లందరూ కలిసి చేసుకునే పార్టీలు కూడా ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. అందులో వరుణ్ సందేశ్, వితికలు చేసే హల్చల్ మరో లెవెల్‌లో ఉంటుంది. రాహుల్ బర్త్ డే వేడుకలు, అలీ రెజా ప్రైవేట్ పార్టీలు, శివ జ్యోతి కొత్తింటి గృహ ప్రవేశం వేడుకల్లో వరుణ్ సందేశ్, వితికలు చేసిన సందడి అందరికీ తెలిసిందే.
ఇలా వరుణ్ సందేశ్ సోషల్ మీడియాలో నిత్యం బిజీగానే ఉంటున్నాడు. తాజాగా వరుణ్ సందేశ్ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో బైకు మీద ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అది విచిత్రం ఏమీ కాదు. కానీ అతని వెనక సీట్లో రెండు పెద్ద కొమ్ములున్న ఎద్దును కట్టి కూర్చోపెట్టాడు. ఆ వింతను గమనించేందుకు ఆ బైక్‌ను అనుసరిస్తూనే వెళ్లాడు. అదెలా సాధ్యమైందని వరుణ్ సందేశ్ దీర్ఘాలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది.