Varun Sandesh : వితిక నాకంటే వయసులో 6 ఏళ్లు చిన్న.. పిల్లలు లేకపోవడంకు కారణం అదే : వరుణ్ సందేశ్
NQ Staff - September 22, 2022 / 10:50 AM IST

Varun Sandesh : కొత్త బంగారు లోకం సినిమాతో హీరోగా స్టార్ మంచి గుర్తింపు దక్కించుకున్న వరుణ్ సందేశ్ హ్యాపీ డే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యాడు. అనూహ్యంగా దక్కిన సక్సెస్ లతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కుర్ర హీరోగా మారి పోయాడు. కానీ దురదృష్టం ఆ వెంటనే అతని తలుపు తట్టింది. రెండు మూడు సంవత్సరాల్లోనే వరుణ్ సందేశ్ కెరియర్ తల కిందులు అయింది.

Varun Sandesh Reveales age gap between him and Vithika
హీరోగా అవకాశాలు ప్రస్తుతం లేవనే చెప్పాలి. వెబ్ సిరీస్ మరియు ఇతర ఓటిటి కంటెంట్ లో నటిస్తూ వస్తున్నాడు. ఇక తనతో నటించిన వితిక షేరు ని వరుణ్ సందేశ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి గురించి గతంలో పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి. వితిక.. వరుణ్ కంటే ఆరు సంవత్సరాలు చిన్నది అవ్వడం వల్ల ఇద్దరి మధ్య బాండింగ్ సరిగా లేదు అంటూ కొందరు పుకార్లు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సమయంలోనే వరుణ్ సందేశ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. తమకు పిల్లలు కలగడం లేదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కానీ తాము పిల్లల గురించి ప్రస్తుతానికి ఆలోచించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. వితికా తనకంటే ఆరు సంవత్సరాలు చిన్నది అవ్వడం వల్ల ఇంకా ఆమె కెరియర్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.. అందుకే పిల్లల విషయంలో కాస్త ఆలోచిస్తున్నామంటూ వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు.
త్వరలోనే తాను ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా చెప్పుకొచ్చిన వరుణ్ సందేశ్ తన భార్య వితిక చాలా స్ట్రాంగ్ పర్సన్ అని.. ఎంత నెగెటివిటీ వచ్చినా కూడా తట్టుకొని నిలుస్తుందని పేర్కొన్నాడు. ఆమె తాను అనుకున్న పని సక్సెస్ అయ్యేంత వరకు కష్టపడి చేస్తుందంటూ వరుణ్ తెలియజేశాడు.