Varun Dhavan : వరుణ్ ధావన్ ఫ్లాప్ స్టార్.! ‘తోడేలు – భేడియా’ మీద ట్రోలింగ్.!
NQ Staff - November 26, 2022 / 10:48 PM IST

Varun Dhavan : బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించిన ‘భేడియా’ తెలుగులో ‘తోడేలు’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. నిజానికి, మంచి రివ్యూలే వచ్చాయి. వసూళ్ళు కూడా బాగానే వున్నాయి. బాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకునేలా వుందని అంతా అనుకున్నారు ఈ సినిమాతో.
కానీ, సీన్ మారిపోయింది రెండో రోజుకే.! ఈ సినిమా మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. సినిమా ఛండాలంగా వుందంటూ ట్వీట్లు పోటెత్తుతున్నాయ్. ‘బ్యాన్ భేడియా’ అంటున్నారు కొందరు నెటిజన్లు.
వరుణ్ ధావన్ ఫ్లాప్ స్టార్ అయ్యాడే..
నిజానికి, వరుణ్ ధావన్ మంచి నటుడే. చాలా మంచి డాన్సర్. యాక్షన్ సీక్వెన్సెస్‌లో అదరగొట్టేస్తాడు. ‘భేడియా’ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు. సినిమా ఘనవిజయం సాధించిందంటూ సినిమా ప్రమోషన్లలో మరింత ఉత్సాహంగా పాల్గొంటున్నాడు సినిమా విడుదలయ్యాక కూడా.
కానీ, నెటిజన్ల ట్రోలింగ్ వేరే లెవల్లో వుంది. ‘వరుణ్ ధావన్ ఫ్లాప్ స్టార్’ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు కొందరు. ఈ హ్యాష్ ట్యాగ్ విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ సినిమాని చంపెయ్యొద్దు మొర్రో.. అంటూ మొత్తుకుంటున్నారు వరుణ్ ధావన్ అభిమానులు.
బాలీవుడ్ నటి కృతి సనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.