Varshini Sounderajan : కేక పెట్టిస్తున్న వ‌ర్షిణి న్యూ లుక్స్… ఈ అమ్మ‌డు కూడా అద‌ర‌గొట్టేస్తుందిగా…!

Varshini Sounderajan : బుల్లితెర యాంక‌ర‌మ్మ‌లు టీవీ షోల‌లోనే కాదు సోష‌ల్ మీడియాలోను దుమ్ము రేపుతున్నారు. గ్లామర్ వల వేసి బుల్లితెరపై బిజీగా ఉంటున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడినట్టు అనిపించినా కూడా యాంకర్‌గా వర్షిణి ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. ఒకప్పటి కంటే ఇప్పుడు వర్షిణి యాంకర్‌గా దూసుకుపోతోంది. కామెడీ స్టార్స్ షోకు సింగిల్ యాంకర్‌గా వర్షిణి మంచి క్రేజ్‌ను దక్కించుకుంది.

Varshini Sounderajan new photo shoot
Varshini Sounderajan new photo shoot

పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ బాగా క్లిక్ అవ్వడంతో వర్షిణి ఫేమస్ అయింది. ఆ తరువాత ఢీ షోలోకి వర్షిణి ఎంట్రీ ఇచ్చింది. అలా బుల్లితెరపై వర్షిణి ప్రయాణం బాగానే కొనసాగింది. హైపర్ ఆదితో కుదిరిన కెమిస్ట్రీతో వర్షిణి మరింత ఫేమస్ అయింది. ఢీ షోలో హైపర్ ఆది వర్షిణి కలిసి చేసిన రచ్చకు అందరూ షాక్ అయ్యారు.

Varshini Sounderajan new photo shoot
Varshini Sounderajan new photo shoot

ఢీ షో నుంచి వర్షిణి బయటకు రావడంతోనే కామెడీ స్టార్స్ అనే కొత్త షో ఆమెకు దక్కింది. కామెడీ స్టార్స్ షోలో వర్షిణి సింగిల్ యాంకర్. కానీ ఇంత వరకు ఆమె పటాస్, ఢీ షోల్లో రవి పక్కన, హైపర్ ఆది పక్కన ఉండేది. కానీ ఇప్పుడు కామెడీ స్టార్స్‌లో సింగింల్‌గా కనిపిస్తోంది. కామెడీ స్టార్స్ ద్వారా వర్షిణికి మంచి పేరు వస్తోంది.

Varshini Sounderajan new photo shoot
Varshini Sounderajan new photo shoot

బుల్లితెరపై అప్పుడ‌ప్పుడు మెరుస్తూ ఉండే ఈ ముద్దుగుమ్ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది . నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అలాంటి వర్షిణి తాజాగా ఓ ఫోటోల‌ను షేర్ చేసింది. స్టైలిష్ డ్రెస్సుల‌లో క్యూట్ లుక్స్‌తో క‌నిపిస్తూ మైమ‌ర‌పిస్తుంది.

Varshini Sounderajan new photo shoot
Varshini Sounderajan new photo shoot

వర్షిణి చీర కట్టినా, మోడ్రన్ దుస్తులు ధరించినా కూడా చూడముచ్చటగా ఉంటుంది. అలాంటి వర్షిణి తాజాగా నల్ల డ్రెస్‌లో క‌నిపించి అంద‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. ఈ ముద్దుగ‌మ్మ గ్లామ‌ర్ షోకి మైమ‌ర‌చిపోతున్నారు.

Varshini Sounderajan new photo shoot
Varshini Sounderajan new photo shoot
Varshini Sounderajan new photo shoot
Varshini Sounderajan new photo shoot