Varshini: ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లోను మ‌తులు పోగొడుతున్న వ‌ర్షిణి

Varshini: తెలుగు తెర‌పై సంద‌డి చేసే యాంక‌ర్స్‌లో వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ ఒక‌రు. రష్మీ, అనసూయ , శ్రీముఖి తరువాత ఆ స్థానం వర్షిణిదే. అయితే వాళ్ళ రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఆమె.. బుల్లితెరపై సందడి చేస్తోంది.

Varshini glamour pics
Varshini glamour pics

గ్లామర్ ఫీల్డులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి అడుగులు పెట్టేసింది. కొన్ని జాతీయ స్థాయి బ్రాండ్లకు సైతం అంబాసీడర్‌గా వ్యవహరించి గుర్తింపు పొందింది.

Varshini glamour pics
Varshini glamour pics

అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించింది. దీంతో దేశ వ్యాప్తంగా మోడల్‌గా ఫేమస్ అయింది. అలా మోడలింగ్ రంగంలోనే ఈ భామ ఎంతో పేరు గడించింది. దీంతో అప్పట్లోనే వర్షిణికి పలు భాషల్లో అవకాశాలు వచ్చాయి.

Varshini glamour pics
Varshini glamour pics

అద్భుతమైన అందంతో మోడల్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న వర్షిణి సౌందరాజన్.. ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, మంచి గుర్తింపును కానీ అందించలేకపోయాయి. దీంతో వర్షిణి సినిమాలకు దూరమైంది.

Varshini glamour pics
Varshini glamour pics

‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌తో మొదటి సక్సెస్‌ను అందుకుంది. ఇందులో బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ హీరోగా నటించాడు. మూడు సీజన్ల పాటు సాగిన ఈ సిరీస్‌ సూపర్ హిట్ అయింది.

Varshini glamour pics
Varshini glamour pics

సినిమాల్లోనూ, వెబ్ సిరీస్‌లోనూ నటించినా వర్షిణి సౌందరాజన్‌కు మాత్రం కావాల్సిన బ్రేక్ దక్కలేదు. దీంతో ఆమె కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలోనే వర్షిణి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Varshini glamour pics
Varshini glamour pics

ఈ క్రమంలోనే కొన్ని చిన్న షోలను హోస్ట్ చేసిన ఆమె.. ‘ఢీ’ షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది. అందులో మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసి ఫేమస్ అయింది. ఆ తర్వాత ‘పటాస్’ సహా కొన్ని గేమ్ షోలలో యాంకర్‌గా చేసి మెప్పించింది. దీంతో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా త‌న క్యూట్ పిక్స్ షేర్ చేసి మ‌తులు పోగొడుతుంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.