Varma: టిక్కెట్ల ఇష్యూపై మ‌ళ్లీ ప్ర‌శ్నించిన రామ్ గోపాల్ వ‌ర్మ‌.. త‌గ్గేదే లే అంటున్నాడుగా..!

Varma: సినిమా టిక్కెట్ ఇష్యూపై గ‌త కొద్ది రోజులుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఏపీ సినిమాటోగ్ర‌ఫీ పేర్ని నానికి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఇద్ద‌రి మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ న‌డిచిన త‌ర్వాత సోమవారం స‌చివాల‌యంలో నానిని క‌లిసారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

varma start movie tickets issue
varma start movie tickets issue

ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో వీరి భేటీ కొనసాగింది. సినిమా టికెట్‌ రేట్ల విషయంలో అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదేనని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ చెప్పారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా మంచి నిర్ణయం వెలువడుతుందనే నమ్మకం ఉందన్నారు.

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రభుత్వం టికెట్‌ ధరలను తగ్గించిందనే వాదనతో ఏకీభవించనని చెప్పారు. పవన్, బాలకృష్ణను టార్గెట్‌ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందనే ఆరోపణలు సరైనవి కావన్నారు. ‘సినీ రంగమంటే ఒకరిద్దరు కాదు. ఈ ఒక్క చర్చతోనే టికెట్ల అంశానికి ముగింపు రాదు.

పరిశ్రమలోని వందల మంది అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందుకే సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో మంత్రికి వివరించాను.’ అని చెప్పారు. నానిని క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత ఈ రోజు ఉద‌యం వ‌ర్మ త‌న సోష‌ల్ మీడియాలో వేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

varma start movie tickets issue
varma start movie tickets issue

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ ధ‌ర 2200/- గా మహారాష్ట్ర అనుమతిస్తోంది. కాని అత‌ని సొంత రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ 200/-కి విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం ఒక అస్తిత్వ ప్రశ్నను లేవనెత్తుతుంది.. “కట్టప్పను ఎవరు చంపారు? అంటూ వ‌ర్మ చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.