RGV: కేఏ పాల్‌పై వ‌ర్మ సెటైర్స్ .. వైర‌ల్‌గా మారిన ట్వీట్స్

గ‌త ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో ప్ర‌జాశాంతి పార్టీ అధినేత‌, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ ఎంత హంగామా సృష్టించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. క్లిష్ట స‌మ‌యంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తుండటంపై మండిప‌డ్డారు. పరీక్షల రద్దు చేయాలనే డిమాండ్‌తో కేఏ పాల్ ఏకంగా దీక్షకు దిగారు. బుర్ర ఉన్న వారెవ‌రైన ఈ స‌మ‌యంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారా అంటూ దీక్ష‌కు దిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే, తాను చేస్తోన్న దీక్షకు వచ్చి ఉండేవారని తెలిపారు.

ఏపీ హైకోర్టులో మే 3వ తేదీన జరిగే విచారణలో పరీక్షలు వాయిదా పడతాయన్నవిశ్వాసం వ్య‌క్తం చేసారు కేఏపాల్. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై వ‌ర్మ త‌నదైన శైలిలో స్పందించారు. వైఎస్ జ‌గ‌న్ నేను మీకు విన‌యంగా అభ్య‌ర్ధిస్తున్నాను. అత‌ను నిర‌హార దీక్ష‌లో చ‌నిపోరు. ఎందుకంటే అత‌ని చ‌నిపోతే ఆయ‌న న‌వ్వుని మిస్ అవుతాము అంటూ సెటైర్స్ వేశారు. గతంలోను వ‌ర్మ‌, కేఏపాల్ ఒకరిపై ఒక‌రు సెటైర్స్ వేసుకొని అంద‌రికి వినోదం పంచిన విష‌యం తెలిసిందే.

Advertisement