Varma: నేడు వ‌ర్మ‌- పేర్ని నాని భేటి.. సినిమా స‌మ‌స్య‌ల‌కు చెక్ ప‌డ‌నుందా?

Varma: గ‌త కొద్ది రోజులుగా ఏపీ సినిమా టిక్కెట్ వ్య‌వ‌హారం సినీ ప‌రిశ్ర‌మకు మింగుడుప‌డ‌డం లేదు. ప‌లువురు మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయాల‌ని అనుకున్నా ఏ మాత్రం ఫ‌లితం రాలేదు. దీంతో రామ్ గోపాల్ వ‌ర్మ ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌భుత్వానికి వ‌ర్మ‌కి మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడిచింది. మొదటి వర్మ.. మంత్రి పేర్ని నానిని కోట్ చేస్తూ ప‌ది ప్రశ్నలు వేశారు. వీటికి సమాధానం చెప్పాలి అంటూ సవాల్ విసిరారు.

varma meeting with perni nani
varma meeting with perni nani

అయితే మంత్రి నాని కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగని వర్మ.. ఆ సమాధానాలకు కూడా ప్రతి దానికి మళ్లీ కౌంటర్ ఇచ్చారు. విమర్శల దాడి పెంచారు.. మీ స్థాయి మీ కారు డ్రైవర్ స్థాయి ఒకటేనా అని ప్రశ్నించారు. చిరంజీవి సినిమా-సంపూర్ణేష్ బాబు సినిమాఒక్కటేనా అని నిలదీస్తూ…. జగన్ ప్రభుత్వానికి, మంత్రి పేర్ని నాని కి కూడా చురకలంటించారు.

అయితే ఈ మాటల యుద్దానికి ఇంకా కొనసాగించడం కంటే.. సమస్యకు పరిష్కారం చూడడం బెటరని భావించిన వర్మ.. తన మనసులో ఆవేదన బయటపెట్టారు. ప్రభుత్వాన్ని నిందించడం తన ఉద్దేశం కాదని.. తమ సమస్యలు మాత్రం తెలిసేలా చేయాలన్నదే తన తాపత్రయం అన్నారు. అందుకే కలిసి చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని మంత్రిని కారు.. వర్మ అడిగిన వెంటనే మంత్రి పేర్ని నాని తప్పకుండా త్వరలో నే కలుద్దామంటూ మాట ఇచ్చారు..

దీంతో మొన్నటి వరకు ఇలా సోషల్ మీడియా వేదికగా జరిగి వార్.. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మీటింగ్ గా మారింది. రేపు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ కానున్నారు. తనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని.. ఈనెల 10వ తేదీన మంత్రి పేర్ని నానితో భేటీ కాబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేశారు.

ఈరోజు మ‌ధ్యాహ్నం (సోమ‌వారం) ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ భేటీ జరగనుంది. తనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని.. ఈనెల 10వ తేదీన మంత్రి పేర్ని నానితో భేటీ కాబోతున్నట్లు ఆర్జీవీ ట్విట్ చేశారు. ఇక ఈ భేటీలో ఏం తేల‌నుంద‌న్న దానిపై అంద‌రిలోనూ ఉత్కంఠత నెల‌కొంది.

varma meeting with perni nani1
varma meeting with perni nani1

ఈ భేటితో గ‌తకొన్ని రోజులుగా జ‌రుగుతోన్న చ‌ర్చ‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుందా.? వ‌ర్మ ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధించ‌నున్నారు.. దానికి నాని ఎలాంటి స‌మాధానాలు ఇస్తారో తెలియాలంటే మ‌రికొద్ది సేపు వేచి చూడాల్సిందే. అయితే కేవలం ఒక డైరెక్టర్ గా ఆయన మంత్రిని కలుస్తారా.. లేక సినిమా ఇండస్ట్రీ తరపున వర్మ మాట్లాడుతారా అన్నది చూడాలి..