ఐదెక‌రాల పొలం ఉంది, న‌న్ను పెళ్లి చేసుకుంటావా.. హీరోయిన్‌కు నెటిజ‌న్ రిక్వెస్ట్

Priyanka - May 21, 2021 / 11:30 AM IST

ఐదెక‌రాల పొలం ఉంది, న‌న్ను పెళ్లి చేసుకుంటావా.. హీరోయిన్‌కు నెటిజ‌న్ రిక్వెస్ట్

సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ పంపే కామెంట్స్ కొన్ని వింత‌గా విచిత్రంగా ఉంటాయి. వీటిని సెల‌బ్స్ చాలా లైట్ తీసుకుంటార‌నే సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. తాజాగా నాని స‌ర‌స‌న మ‌జ్ను చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఎమ్మాన్యుయేల్‌కు ఓ నెటిజ‌న్ నుండి అనుకోని రిక్వెస్ట్ ఎదురైంది. దీనిపై ఈ అమ్మ‌డు అయితే స్పందించ‌లేదు కాని, ఈ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. అను ఇమాన్యుయేల్ .. అల్లు అర్జున్‌, పవన్‌కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టినా ఈ అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు. మంచి అవ‌కాశాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది.

anu 1

ఇందుకోసం సోష‌ల్ మీడియాలో నిత్యం త‌న ఫొటోషూట్స్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా లాంగ్‌ వైట్‌ కలర్‌ షర్ట్‌ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను షేర్‌ చేయగా ఓ నెటిజన్‌ నుంచి ఊహించని విధంగా రియక‌్షన్‌ వచ్చింది. మీరు నన్ను పెళ్లిచేసుకుంటారా? నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. గార్డెన్‌తో కూడిన ఓ అందమైన ఇళ్లు ఉంది. అలాగే ఓ స్కూటర్‌ కూడా ఉంది. వీటి కన్నా మీపై చ‌చ్చేంత ప్రేమ ఉందంటూ పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ కాగా, అను దీనిపై ఎలా స్పందిస్తుందని నెటిజ‌న్స్ ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ అమ్మ‌డు శిరీష్‌తో ప్రేమ‌లో ఉంద‌ని అప్ప‌ట్లో పుకార్లు హ‌ల్ చ‌ల్ చేశాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us