Varasudu Movie : ఓవైపు ట్రోల్స్, మరో వైపు బంపర్ వ్యూస్.. అవతార్ టూ రికార్డుల్ని బీట్ చేసిన వారిసు
NQ Staff - January 5, 2023 / 02:01 PM IST

Varasudu Movie : పొంగల్ బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్న వారిసు ఇప్పుడే కాదు.. కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటోంది. ఇక లేటెస్టుగా ఈ మూవీ ట్రైలర్ రిలీజయిన నెక్స్ట్ మినిట్ నుంచే సోషల్మీడియాలో ఎక్కడ చూసినా వారిసు పోస్టులే, ఆ ట్రైలర్ గురించి మీమ్సు, కామెంట్సే. కొందరేమో గౌతమ్ SSC లా ఉందంటే, మరికొందరు అలవైకుంఠపురంలో ఛాయలు కనిపిస్తున్నాయంటున్నారు.
ఇంకొందరు మహర్షి, అజ్ఞాతవాసి చిత్రాలతో పోలుస్తున్నారు. ఇన్ని తెలుగు సినిమాల కథల్ని కలిపి కొట్టాడు కాబట్టే.. ఈ మూవీని డైరెక్టుగా తెలుగులో తెరకెక్కించలేదంటూ ఓపెన్ గానే ట్రోల్ చేస్తున్నారు ఇంకొందరు.
ఇదంతా ఒకవైపైతే.. మరోవైపు ట్రైలర్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తూ దళపతిగా తన మానియా ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్. వారిసు తమిళ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 21 మిలియన్ల వ్యూస్ తో 1.7 మిలియన్ల లైకుల్ని క్రాస్ చేసింది. అంతే కాదు.. రిలీజైన రెండు గంటల్లోనే అవతార్ టూ ట్రైలర్ లైక్స్ నెంబర్సుని దాటేసింది. అవతార్ 2 ట్రైలర్ 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసినా మొత్తంగా ఒక్క మిలియన్ లైకుల్నే దక్కించుకుంది. ఆ లెక్కని చెరిపేయడానికి విజయ్ కి గంటలు కూడా పట్టకపోవడం సరికొత్త రికార్డుగా నమోదయింది.
వారిసు మూవీ తెలుగులో వారసుడుగా డబ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ ట్రైలర్ కూడా 24 గంటలలోపే మూడు మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. వాటితో పాటు ఇతర తెలుగు చిత్రాల కథలు, రిఫరెన్సులు, సీన్ల పోలికలతో ట్రోల్సునూ కూడా సొంతం చేసుకుంటుంది. ఇక తమిళ్ ప్రీ రిలీజు ఫంక్షన్లో దిల్ రాజు స్పీచ్ మీదొచ్చిన మీమ్స్, ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్మీడియాలో ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు.

Varasudu Movie Trailer Been Released As New Record
నిజానికి విడుదలకు ముందు నుంచే వివాదాల్లో నిలుస్తూ వచ్చింది వారిసు. ఇక నిర్మాతల స్ట్రయిక్ సమయంలో, థియేటర్ల విషయంలో, అజిత్ లాంటి స్టార్ హీరోలతో పోలుస్తూ దిల్ రాజు చేసిన కామెంట్స్ వల్లో రెండు ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్ గా మారింది వారిసు. ఇక ట్రైలర్ చూశాక ఈ మాత్రం మూవీకేనా ఇంత హడావిడంటూ కాస్త ఘాటుగానే నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి.
ఇక కామెంట్స్, ట్రోల్స్ సంగతెలా ఉన్నా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మూవీపై బజ్ మాత్రం క్రియేటవుతుంది. ఏదో ఓ రకంగా ఆడియెన్స్ నోట్లో నానుతుంది. దాంతో అవతార్ టూ లాంటి సినిమా ట్రైలర్ల రికార్డుల్ని కూడా బీట్ చేస్తోంది. మరోవైపు సంక్రాంతికి ఎన్ని మాస్ మసాలా, కమర్షియల్ సినిమాలున్నా ఫ్యామిలీ ఎంటర్టెయినర్లకే ఆడియెన్స్ ఇంట్రస్ట్ చూయిస్తారు.
ఆ లెక్కన ఈ సారి సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాల్లో వారిసు మూవీకే స్కోప్ ఎక్కువగా ఉంది. మరి రిలీజుకు ముందే ట్రైలర్ తోనే ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిన విజయ్, ఈ పండక్కి సినిమా విడుదల చేసి ఏ రేంజ్ సక్సెస్ కొడతాడో వేచి చూడాలి మరి.