Varalakshmi: యోగా స‌మ‌యంలోను అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసిన వ‌ర‌ల‌క్ష్మీ

Varalakshmi: వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు ఈ అమ్మ‌డు త‌మిళం క‌న్నా తెలుగులో చాలా బిజీ అయింది. ఇటీవల తెలుగులో ఆమె చేసిన క్రాక్, నాంది సినిమాలలు ఏ రేంజ్ హిట్టయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ ఊపుతోనే మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. వరలక్ష్మి 16 ఏళ్ల వయసులోనే సినిమా అవ‌కాశాలు అందిపుచ్చ‌కుంది.

varalakshmi yoga video.jpg
varalakshmi yoga video.jpg

శంకర్ బాయ్స్ సినిమాలో జెనీలియా కంటే ముందు హీరోయిన్ గా వ‌ర‌ల‌క్ష్మీనే అనుకున్నారాట. కానీ అప్పుడు ఎడ్యుకేషన్ కారణంగా సినిమాలకు చాలా దూరంగానే ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. ఇక 2012లో శింబు పోడా పొడి సినిమా ద్వారా వరలక్ష్మి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.

వరలక్ష్మి హీరోయిన్ గా అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు. ఇక ఎప్పుడైతే ఆమె విజయ్ సర్కార్ సినిమాలో నెగిటివ్ రోల్ చేసిందో అప్పటి నుంచి డిమాండ్ మరింత పెరిగింది. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో తన నటనతో విజయ్ కు పోటీని ఇచ్చింది. పవర్ఫుల్ ఐరెన్ లేడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది.

రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మా అనే మాస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే 8 ఏళ్ల నుంచి హిట్టు కోసం పరితపిస్తున్న అల్లరి నరేష్ సినిమాలో ఒక లాయర్ పాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఇండస్ట్రీలో పవర్ఫుల్ లేడి పాత్రల కోసం నటిగా వరలక్ష్మి అయితే బెటర్ అని దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వెంటపడుతున్నట్లు సమాచారం.

అప్పుడ‌ప్పుడు వ‌ర‌ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు యోగాస‌నాలు చేయ‌గా, అవి కూడా చాలా హాట్‌గా ఉండ‌డం విశేషం. ప్ర‌స్తుతం వ‌ర‌ల‌క్ష్మీ అందాల‌కు కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. కాగా, అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న పొలిటికల్ సినిమాలో అమ్మడు ఒక రాజకీయ నాయకురాలిగా కనిపించబోతోందట. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్న అఖిల్ కొత్త సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

Actress Varalakshmi Sarath Kumar SUPERB H0T Yoga Asanas | Varalakshmi Sarath Kumar Latest Video | DC – YouTube