Vara lakshmi: విల‌న‌మ్మ ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా… పొట్టిదుస్తుల‌లో క్యూట్‌గా క‌నిపిస్తున్న వ‌ర‌ల‌క్ష్మీ

Vara lakshmi: వరలక్ష్మి శరత్ కుమార్ అంటే ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులో ఎక్కువగా సినిమాలు చేస్తుంది .కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ పెద్ద కూతురైన ఈ టాలెంటెడ్ నటీమణి క్రాక్, నాంది సినిమాల‌తో టాలీవుడ్‌లో స‌త్తా చాటింది. మొదట వరలక్ష్మికి 16 ఏళ్ల వయసులోనే అవకాశాలు చాలా వచ్చాయి. ముఖ్యంగా శంకర్ బాయ్స్ సినిమాలో జెనీలియా కంటే ముందు హీరోయిన్ గా అనుకున్నారాట.

 

varalakshmi stylish look2
varalakshmi stylish look2

కానీ అప్పుడు ఎడ్యుకేషన్ కారణంగా సినిమాలకు చాలా దూరంగానే ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. ఇక 2012లో శింబు పోడా పొడి సినిమా ద్వారా వరలక్ష్మి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఎప్పుడైతే ఆమె విజయ్ సర్కార్ సినిమాలో నెగిటివ్ రోల్ చేసిందో అప్పటి నుంచి డిమాండ్ మరింత పెరిగింది. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో తన నటనతో విజయ్ కు పోటీని ఇచ్చింది.

ఇక ఇటీవల వరుసగా రెండు సినిమాలతో ఆమె ప్లాప్ లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చిందని ఇండస్ట్రీలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మాస్ రాజా రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మా అనే మాస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే 8 ఏళ్ల నుంచి హిట్టు కోసం పరితపిస్తున్న అల్లరి నరేష్ సినిమాలో ఒక లాయర్ పాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

varalakshmi stylish look
varalakshmi stylish look

వ‌రలక్ష్మీ శరత్ కుమార్, తెలుగు తెరపై మరోసారి విలన్ గా విజృంభించనుంది .. అదీ బాలయ్య సినిమాలో కావడం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమా క్రాక్ కు గోపీచంద్ మలినేనినే దర్శకత్వం వహించారు. ‘క్రాక్’లో హీరోయిన్ గా చేసిన శ్రుతిహాసన్ ను ఈ సినిమా కోసం ఒప్పించాడు. అదే విధంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ను కూడా తీసుకున్నాడని అంటున్నారు.

అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న పొలిటికల్ సినిమాలో అమ్మడు ఒక రాజకీయ నాయకురాలిగా కనిపించబోతోందట. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్న అఖిల్ కొత్త సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

varalakshmi stylish look1
varalakshmi stylish look1

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ అప్పుడ‌ప్పుడు అందాలు ఆర‌బోస్తూ కేక పెట్టిస్తుంది. తాజ‌గా ఈ అమ్మ‌డు పోట్టి దుస్తుల‌లో పిచ్చెక్కించింది.