Varalaxmi : వరలక్ష్మి కోలీవుడ్ మీద షాకింగ్ కామెంట్స్ ..అక్కడి మేకర్స్ హర్ట్ అవుతారేమో.?

Varalaxmi : వరలక్ష్మి కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసింది. యంగ్ ఏజ్ లో ఉన్న ప్రతీ ఒక్కరు స్టార్ హీరోయిన్ అవ్వాలని నానా తంటాలు పడుతుంటారు. కాని వరలక్ష్మి మాత్రం వాళ్ళందరికంటే భిన్నం. ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రలు వచ్చినా సైన్ చేస్తుంది. తనలో ఉన్న నటిని బయటికి తీసుకు వస్తుంది. ఇప్పటికే తమిళంలో ఎన్నో ఛాలెంజింగ్ రోల్ లో నటించి మెప్పించింది. అయితే వరలక్ష్మి కి తెలుగు సినిమాలలో నటించాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. కాని దాదాపు అయిదు ఆరేళ్ళుగా ట్రై చేస్తోంది. కాని టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

varalakshmi-shocking-comments-on-kolly-wood
varalakshmi-shocking-comments-on-kolly-wood

అయితే అనూహ్యంగా మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించే అవకాశం అందుకుంది. రేయ్ కాకి అంటూ పవర్ ఫుల్ డైలాగులతో బలమైన పాత్ర పోషించింది. ఈ సినిమాలో వరలక్ష్మి పర్ఫార్మెన్స్ కి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. విలన్ కి ఎంతటి పేరు వస్తుందో అంతటి పేరు వరలక్ష్మి కి వచ్చింది. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. అదే సమయంలో అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాలో కూడా మంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ రెండు సినిమాలతో వరలక్ష్మి టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది.

Varalakshmi : వరలక్ష్మి ని మించి ఆర్టిస్టులు ఇండస్ట్రీకి రావడం కష్టమని అంటున్నారు.

కోలీవుడ్ లో దాదాపు 9 ఏళ్ళుగా ముఖ్య పాత్రల్లో నటిస్తూ వస్తున్న వరలక్ష్మి కి అక్కడ రాని క్రేజ్ అండ్ పాపులారిటీ క్రాక్ సినిమా అండ్ నాంది సినిమాలతో వచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా వరలక్ష్మీ వెల్లడించడం ఆసక్తికరం. దీంతో తెలుగులో ఎన్నో గొప్ప పాత్రలు వరలక్ష్మి కి వస్తున్నాయట. కొన్ని పాత్రలకి ఖచ్చితంగా వరలక్ష్మి నే తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. మొత్తానికి టాలీవుడ్ లో వరలక్ష్మి కి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పట్లో వరలక్ష్మి ని మించి ఆర్టిస్టులు ఇండస్ట్రీకి రావడం కష్టమని అంటున్నారు. చూడాలి మరి వరలక్ష్మి టాలీవుడ్ లో ఎలాంటి పాత్రల్లో కనిపించబోతుందో.

Advertisement