Chiranjeevi: చిరంజీవి చెల్లెలి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్

Chiranjeevi ప్రతిభ, అదృష్టం ఉంటే ఎవ్వరైనా సరే సినీ ఇండస్ట్రీలో బిజీ అవ్వొచ్చని నిరూపించారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. సర్కార్ లాంటి సినిమాలో పొలిటికల్ లీడర్ గా.. దళపతి విజయ్ కి ధీటుగా విలనిజం కనబరిచేలా వ్యూహాలు పన్నడమంటే మాములు విషయం కాదు. నటించాలనే తపనతో పాటు ఆర్టిస్ట్ గా ఎదగాలనే పట్టుదల ఆమెలో ఉంది. అందుకే నేడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ.. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. ఆ తర్వాత నుండి టాప్ హీరోలకు ధీటైన విలన్ గా తన పర్ఫార్మెన్స్ తో అద్దరగొడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాంది సినిమాలో ఆధ్యాగా నటించినా.. రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మ గా అలరించినా తనకే సాధ్యం అని చెప్పొచ్చు. పాజిటివ్, నెగిటివ్ క్యారెక్టర్ తో సంబంధం లేకుండా తనను నమ్మి ఇచ్చిన పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేస్తుంది ఈ నటి.

Varalakshmi Sarath Kumar as Chiranjeevi's younger sister
Varalakshmi Sarath Kumar as Chiranjeevi’s younger sister

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమా తర్వాత తమిళ సినిమాలు వేదాళం, లూసిఫర్ రీమేక్ లు సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. అందులోనూ మొదట లూసీఫర్ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర సినిమాకి కీలకంగా ఉండబోతోంది. ఇదొక పొలిటికల్ ఎంటర్ టైనర్. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ పాత్ర కోసం టాప్ హీరోయిన్లను పరిశీలించడం జరిగింది. అయితే చిరంజీవి చెల్లెలి పాత్ర అనే కారణాలతో వారు రిజెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్.

ఈ క్రమంలో చిరంజీవి, తన చెల్లెలి పాత్ర కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు దర్శకనిర్మాతల ముందు ఉంచినట్లు తెలుస్తుంది. వరలక్ష్మీ యాక్టింగ్ కి చిరంజీవి ఫిదా అయిన విషయం తెలిసిందే. అందుకే ఈ పాత్ర కోసం ఆమె కరెక్ట్ అంటూ దర్శకనిర్మాతలు కూడా ఆమెను కలిసినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.

Advertisement