Ramya Krishnan: నన్ను చూసి ఓర్వలేకపోతున్నారంటూ రమ్యకృష్ణపై కామెంట్స్
Samsthi 2210 - August 2, 2021 / 03:44 PM IST

Ramya Krishnan: తమిళ సినీ నటి, బిగ్ బాస్ ఫేం వనిత విజయకుమార్ ఇటీవలి కాలంలో వార్తలలో ఎక్కువగా నిలిచింది. వ్యక్తిగత విషయాలతో నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలిచిన ఈ అమ్మడు ప్రస్తుతం పలు షోస్ తో బిజీగా ఉంది. ఓ టెలివిజన్ షోలో అడుగుపెట్టాక నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆ షో నుండి వెళ్లిపోయినట్లు లేఖ ద్వారా తెలిపింది. చివరి ఎపిసోడ్‌లో తాను వేసిన కాళిక అవతారానికి ప్రశంసలు కురిపించినందుకు ధన్యవాదాలు తెలిపింది.
‘బిగ్‌బాస్ జోడిగల్’ రియాలిటీ షోలో పాల్గొంటున్న వనిత అర్ధాంతరంగా షో నుండి బయటకు రావడానికి కారణం కాస్టింగ్ కౌచ్, వేధింపులు, అవమానాలు అంటూ ట్వీట్లు చేసిన వనితా.. ఓ సీనియర్ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. వర్క్ ప్లేస్ లో కొందరు అనైతికంగా, వ్యతిరేకంగా స్పందించారని బాధపడింది. ముగ్గురు పిల్లలకు తల్లైన కూడా బాగా రాణిస్తున్నాననే ఇగోతో తనతో దారుణంగా ప్రవర్తించారని, మగవాళ్లే కాకుండా ఆడవాళ్లు కూడా తన ఎదుగుదల చూసి తట్టుకోలేకపోయారని తెలిపింది.
తోటి మహిళలకు తోటి మహిళ సహాయం పడాలనే ఆలోచన లేదని మండిపడింది. ఇక తను ఆ షో నుండి వెళ్లిపోవడం బాధగా ఉందని తెలిపింది. అయితే ఓ సీనియర్ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని వనిత చెప్పడంతో అందరు రమ్యకృష్ణ గురించే ఆమె అలా మాట్లాడిందని అనుకుంటున్నారు. షోకు హోస్ట్ గా రమ్యకృష్ణ ఉండడంతో పాటు అందరిలో సీనియర్ ఆమెనె. ఈ క్రమంలో రమ్యకృష్ణపైనే వనిత సంచలన వ్యాఖ్యలు చేసి ఉంటుందని అందరు భావిస్తున్నారు.
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున.. భర్త సపోర్ట్ లేకుండా, ముగ్గురు పిల్లల తల్లిని అయ్యి కూడా కెరీర్ పరంగా ఎదుగుతుంటే కొందరు తనను జలసీగా ఫీల్ అవుతున్నారని వనిత కామెంట్స్ చేసింది. ఈ వివాదాన్ని ఓ కోలీవుడ్ ఛానెల్ రమ్యకృష్ణ దగ్గరకు తీసుకెళ్లగా, ఆమె షార్ప్‌గా స్పందించింది.
‘‘షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెను అడిగి ఉంటే బాగుండేది’’ అని రమ్యకృష్ణ బదులిచ్చింది. ‘నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు. నో కామెంట్స్ అని తేల్చేసింది కాగా, చివరి ఎపిసోడ్‌లో వనిత పర్‌ఫార్మెన్స్‌కు పదికి 1 మార్క్ ఇచ్చింది రమ్యకృష్ణ.