VAKEEL SAAB: భారీ స్థాయిలో వ‌కీల్ సాబ్ విడుద‌ల‌.. రికార్డుల‌పై గురి పెట్టిన ప‌వ‌ర్ స్టార్

టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రైన ప‌వన్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్ రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉండ‌గా, మొద‌టి ఆట చూడాల‌ని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర కోలాహలం నెల‌కొని ఉంది. భారీ క‌టౌట్స్ , డ‌ప్పులు, బాణా సంచా కాలుస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2200కు పైగా థియేట‌ర్స్ లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. నిజాం 360, సీడెడ్ 225, ఆంధ్రా 610, క‌ర్ణాట‌క అండ్ ఆర్ఓఐ 305, ఓవ‌ర్సీస్ 700 ఇలా భారీ స్థాయిలో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల‌లో వ‌కీల్ సాబ్ చిత్రం 32 నుండి 35 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు చేస్తుంద‌ని అంచనా వేస్తున్నారు. తొలి వారంలో ఈ సినిమా రేట్లు భారీగా పెంచిన నేప‌థ్యంలో వ‌కీల్ సాబ్ చిత్రం భారీ వ‌సూళ్లు రాబ‌ట్టడం ఖాయంగా క‌నిపిస్తుంది. ప‌వన్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్‌ను శ్రీరామ్ వేణు తెర‌కెక్కించ‌గా, దిల్ రాజు- బోని క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. నివేదా థామ‌స్, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించనున్నారు.

Advertisement