VAKEEL SAAB: వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌పై లేటెస్ట్ అప్‌డేట్‌.. ఇక రికార్డుల ప్ర‌భంజ‌నం మొద‌లు!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన తాజా చిత్రం వ‌కీల్ సాబ్. దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు. వెరైటీగా చేస్తున్న‌ ప్ర‌మోష‌న్స్ సినిమా బజ్ ను పెంచేశాయి. ఇక ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేసి అంచ‌నాలు రెట్టింపు చేయాల‌ని భావించిన మేక‌ర్స్ మార్చి 29 సాయంత్రం ఆరు గంట‌ల‌కు ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టైలిష్ పోస్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ప‌వ‌న్ ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపారు.

హిందీలో సూప‌ర్ హిట్ అయిన పింక్ రీమేక్‌గా వ‌కీల్ సాబ్ చిత్రం తెర‌కెక్కింది. ఇందులో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టించగా, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప‌వ‌న్ రీ ఎంట్రీ చిత్రంగా తెర‌కెక్కిన ఈ మూవీపై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన హ‌రిహ‌రి వీర‌మ‌ల్లు, అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రాలు థియేట‌ర్స్‌లోకి రానున్నాయి.

Advertisement