VAKEEL SAAB: ఓటీటీలో వ‌కీల్ సాబ్.. నిపుణులు ఏమంటున్నారంటే..!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో వేణు శ్రీరామ్ తెర‌కెక్కించిన చిత్రం వ‌కీల్ సాబ్. 2016లో వ‌చ్చిన పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు- బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 9న వ‌కీల్ సాబ్ చిత్రం విడుద‌ల కాగా, ఈ సినిమా తొలి వారం బాక్సాఫీస్ ద‌గ్గర భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రెండో వారానికి వ‌చ్చే స‌రికి క‌రోనా వ‌ల‌న థియేట‌ర్‌కు వ‌చ్చే జనాల సంఖ్య త‌గ్గింది. దీంతో వ‌కీల్ సాబ్ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ఓటీటీలో విడుద‌ల చేస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

ఈ ప్ర‌చారంపై స్పందించిన చిత్ర నిర్మాత దిల్ రాజు పెద్ద చిత్రాల‌ని 50 రోజుల త‌ర్వాతే ఓటీటీలో విడుద‌ల చేస్తార‌ని, వ‌కీల్ సాబ్ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా వ‌కీల్ సాబ్ ఓటీటీలో రిలీజ్‌పై కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. మే 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తుంది అని టాక్ మొదలయ్యింది. కానీ అదంతా వాస్త‌వం అని అంటున్నారు. మే చివరి వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు వస్తుంది అని చెప్తున్నారు ఓటీటీ నిపుణులు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా అనన్య నాగళ్ళ, నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించగా, శృతి హాస‌న్, ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Advertisement