VAKEEL SAAB: వ‌కీల్ సాబ్ ఫైట్ రిక్రియేష‌న్ వీడియో.. పిల్ల‌ల గ్యాంగ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం

సోష‌ల్ మీడియా ప్రాచుర్యం బాగా పెరిగాక జ‌నాల‌లో ఉన్న టాలెంట్ న‌లుగురికి తెలుస్తుంది. సినిమాల‌లోని కొన్ని సీన్స్ రీక్రియేట్ చేస్తూ వాటికి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి నెటిజ‌న్స్‌ని అల‌రిస్తున్నారు నేటి త‌రం కుర్రాళ్లు. ఇప్ప‌టికే బాహుబ‌లి సినిమాలోని కొన్ని సీన్స్ రీ క్రియేట్ చేసి వావ్ అనిపించారు. ఇక రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి విడుద‌లైన వీడియోల‌ని కూడా రీ క్రియేట్ చేసి అద‌ర‌గొట్టారు. ఇక తాజాగా వకీల్ సాబ్ సినిమాలోని ప్రీ-క్లైమాక్స్ ఫైట్ సీన్ ఒరిజినల్ కు ఏమాత్రం తీసిపోకుండా పిల్లలు గ్యాంగ్ కలిసి రూపొందించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

వ‌కీల్ సాబ్ చిత్రంలో ఇంట‌ర్వెల్ బాత్‌రూం సీన్‌తో పాటు మెట్రో ఫైట్ సీన్‌ను మిక్స్ చేసి ఒరిజిన‌ల్ స‌న్నివేశాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా నెల్లూరుకు చెందిన కుర్రాళ్లు కంపోజ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే అంద‌రు నోరెళ్ల‌పెట్ట‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. తమన్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ కు ఫైట్స్ – షాట్స్ – స్టైల్ తో సింక్ చేస్తూ కుర్రాళ్ళు అదరగొట్టారు. ప్రస్తుతం వారి వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విలేజ్‌లోని ఓ ఇంట్లో ఈ సీన్ చేయ‌గా, దీన్ని అద్భుతంగా డిజైన్ చేశార‌ని అంతా మెచ్చుకుంటున్నారు. స్లో మోష‌న్‌లోను స‌న్నివేశాలు అదిరిపోయాయి.

ఇలాంటి గ్రేట్ టాలెంట్ విలేజ్ లెవెల్లో నుండి ప్రపంచానికి పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉందంటూ పలువురు వీడియో చూసిన ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ కావ‌డంతో దీనిని త‌మ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ‘వీడియో చూసాక అసలు నమ్మలేకపోయాను. ఈ కుర్రాళ్లు మొత్తం ఇరగదిశారు. ఆ మ్యూజిక్ కు షాట్స్ సింకింగ్ చూస్తే మతిపోతుంది. వావ్ క్రేజీ’ అంటూ ట్వీట్ చేసాడు. అలాగే డైరెక్టర్ సాయిరాజేష్ కూడా వీడియో పై స్పందించి.. ‘ఆ కుర్రాళ్ల ప్రతిభ అదిరిపోయింది. ఎవరైనా వారి డీటెయిల్స్ ఉంటే మెసేజ్ చేయండి’ అని ట్వీట్ చేశారు.