Vakeel saab : వకీల్ సాబ్ కి ఆరకంగానే పెట్టిన డబ్బు వచ్చేసిందా..దటీజ్ పవర్ స్టార్..!

Vakeel saab : వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కి దగ్గరపడున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరిలోను విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే హిందీ, తమిళ భాషల్లో పింక్, నేర్కొండ పార్వైగా వచ్చి సూపర్ హిట్ సాధించిన సినిమా అయినప్పటికి తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా కావడం తో అందరి చూపు వకీల్ సాబ్ మీదే ఉంది. హిందీ, తమిళంలో ఈ సినిమా 100 కోట్ల కి పైగానే వసూళ్ళు సాధించింది.

vakeel-saab- non theatrical business completed
vakeel-saab- non theatrical business completed

అందుకే తెలుగులో వసూళ్ళు ఎలా ఉంటాయి.. అబితాబ్ బచ్చన్, అజిత్ లని మించి పవర్ స్టార్ తెలుగులో ఎక్కువ వసూళ్ళు తేగలడా..అంటూ చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ మధ్య వకీల్ సాబ్ బిజినెస్ విషయంలో ఎలాంటి న్యూస్ రాకపోవడం తో అందరిలో రక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. బిజినెస్ కావడం లేదా..అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కాని తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ బిజినెస్ అదిరిపోయిందని తెలుస్తోంది.

Vakeel saab : వకీల్ సాబ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత జరుగుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్..!

వకీల్ సాబ్ సినిమా నాన్ థియేటర్స్ రైట్స్ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ‘జీ’ టీవీ వారు సొంతం చేసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలుపుకొని 30 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మారట. ఇప్పటికే రెండు భాషల్లో చూసేసిన సినిమా అయినా పవన్ కళ్యాణ్ స్టామినా ని బట్టి ఇంత నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటే గొప్ప విషయం అంటున్నారు. ఇక థియేట్రికల్ బిజినెస్ ఎంత జరుగుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపిస్తుండగా.. శృతి హసన్ గెస్ట్ రోల్ లో…నివేధా థామస్ – అంజలి – అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 9న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

 

Advertisement