VAKEEL SAAB:భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల‌వుతున్న వ‌కీల్ సాబ్.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఉమైర్ ట్వీట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆయ‌న పేరు ఒక పేరు ఓ ప్ర‌భంజ‌నం. అడుగేస్తే బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్దలు కావ‌డం ఖాయం. చూడ్డానికి బ‌క్క ప‌ల‌చ‌గా క‌నిపించిన ధైర్యం విసిరిన రాకెట్ మ‌న ప‌వ‌ర్ స్టార్. ఆయ‌న పేరు చెబితే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ప‌డిచచ్చిపోతుంటారు. రాజ‌కీయాల వ‌ల‌ర మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు వ‌కీల్ సాబ్ అనే చిత్రంతో మ‌రి కొద్ది గంట‌ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఓవర్సీస్ నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అంటూ ప్రీ రివ్యూ ఇచ్చేశారు.సాలిడ్, టెర్రిఫిక్.. పవన్ కళ్యాణ్ బ్యాక్ విత్ బ్యాంగ్ అంటూ ట్వీట్లు పెట్టాడు.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రాన్ని త‌న ఫ్యామిలీతో క‌లిసి చూసేందుకు చిరంజీవి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ లో పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటించ‌గా, నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే థియేటర్స్ వద్ద అభిమానులతో సందడి మొదలైంది. మూడేళ్ళ తర్వాత తమ అభిమాన హీరోని తెరపై చూడడానికి ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

లైవ్ అప్ డేట్స్ కోసం 11.45 ని.ల నుండి న్యూస్ క్యూబ్‌ సైట్‌ను ఫాలో అవ్వండి.

Advertisement