vakeel saab : వకీల్ సాబ్ టీజర్ మీద పెట్టుకున్న నమ్మకాలన్ని నట్టేట మునిగినట్టేనా ..?
Vedha - January 25, 2021 / 05:00 PM IST

vakeel saab : వకీల్ సాబ్ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు..ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేంగా చెప్పనవసరం లేదు. అసలు సినిమాలే చేయడనుకున్న పవన్ కళ్యాణ్ మనసు మార్చుకొని మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ తో రాబోతున్నాడు. అంతేకాదు వరసగా భారీ సినిమాలలో నటించేందుకే రెడీ అయ్యాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో కొన్నేళ్ళుగా సినిమా తీయాలనుకున్న నిర్మాత దిల్ రాజు కూడా ఖర్చు కి ఆలోచించకుండా భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించాడు. ఒక రీమేక్ సినిమా.. అది కూడా ఇప్పటికే రెండు ప్రధాన భాషల్లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాని మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడం అంటే పెద్ద సాహసమే.

vakeel-saab-is vakeel saab teaser not created hopes
అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కారణంగా దిల్ రాజు బ్లైండ్ గా ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్ మేకర్ బోనీకపూర్ సమర్పణలో తయారవుతున్న వకీల్ సాబ్ కి యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తైన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. మూడవ సారి శృతిహాసన్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ లో నటిస్తోంది. చిన్న క్యారెక్టర్ అయినా కూడా కథలో చేసిన మార్పులతో శృతిహాసన్ క్యారెక్టర్ కి బాగానే ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ తో పాటు అంజలి.. అనన్య నాగళ్ళ.. సీనియర్ నరేష్ .. ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
vakeel saab : వకీల్ సాబ్ టీజర్ ని కేజీఎఫ్ 2 టీజర్ తో పోల్చడం కరెక్టేనా ..?
అయితే వకీల్ సాబ్ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అభిమానులకి ఆ టీజర్ పెద్దగా ఆకట్టుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పాన్ ఇండియన్ సినిమా కేజీఎఫ్ 2 టీజర్ తో పోల్చుకుంటే వకీల్ సాబ్ టీజర్ అంత లేదన్న మాట వినిపిస్తంది. అదీకాక సినిమా మీద బజ్ క్రియేట్ అవడానికి వకీల్ సాబ్ టీజర్ పెద్దగా ప్లస్ అయింది లేదని చెప్పుకుంటున్నారట. అయితే ఇక్కడ వకీల్ సాబ్.. కేజీఎఫ్ సినిమాల జోనర్స్ పూర్తిగా వేరే. కాబట్టి సినిమాలో గట్టి కథ కథనం ఉంటే వకీల్ సాబ్ సెన్షేనల్ హిట్ అవడం ఖాయమని అంటున్నారు. మరి దిల్ రాజు ఎంతో నమ్మకంగా పెట్టిన పెట్టుబడి తిరిగి ఎంతవరకు రాబట్టి లాభాలు తీసుకు వస్తుందో చూడాలి.