VAKEEL SAAB: వివాదంలో వ‌కీల్ సాబ్ చిత్రం.. నిర్మాత‌ల‌కు లీగ‌ల్ నోటీసులు..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అంజ‌లి, నివేదా థామ‌స్, శృతి హాస‌న్, అన‌న్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వేణు శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం వ‌కీల్ సాబ్. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. అజ్ఞాత‌వాసి చిత్రం త‌ర్వాత ప‌వ‌న్ మ‌ళ్లీ వ‌కీల్ సాబ్ చిత్రంతో వెండితెర‌పై మెరిసాడు. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్‌ను పెద్ద తెర‌పై చూసే స‌రికి ఫ్యాన్స్ పూన‌కంతో ఊగిపోయారు. క‌రోనా వ‌ల‌న ఈ సినిమా థియేట‌ర్స్ లో ఎక్కువ రోజులు ఆడ‌క‌పోవ‌డంతో మూవీని ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేశారు. ఓటీటీలో ఈ చిత్రం మంచి ఆద‌ర‌ణ‌తో దూసుకుపోతుంది.

అయితే వ‌కీల్ సాబ్ చిత్రంలో సుధాకర్ అనే వ్య‌క్తికి సంబంధించిన ఫోన్ నెంబ‌ర్‌ను ఓ స‌న్నివేశంలో వెండితెర‌పై చూపించార‌ట‌. దీంతో అత‌నికి నాన్‌స్టాప్ కాల్స్ వ‌స్తున్నాయ‌ట‌. కొంద‌రైతే నోటికి వ‌చ్చిన‌ట్టు తిడుతున్నార‌ని సుధాక‌ర‌ణ ఆవేద‌న‌ను పోలీస్ స్టేష‌న్‌లో వెళ్ల‌బుచ్చుకున్నాడు. వ‌కీల్ సాబ్ చిత్ర నిర్మాత‌ల‌పై పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేయ‌గా, త‌న లాయ‌ర్ ద్వారా వకీల్ సాబ్ నిర్మాత‌ల‌కు నోటీసులు కూడా పంపారు సుధాక‌ర్. దీనిపై నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి. అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్‌’కు రీమేక్‌గా తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించారు.

Advertisement