Vakeel saab : వకీల్ సాబ్ ఎన్ని వందల స్క్రీన్స్ కేటాయించారో..ఇదొక రికార్డ్..!

Vakeel saab : వకీల్ సాబ్ సినిమాకి సంబంధించి ఇప్పుడు ప్రతీది పెద్ద సంచలనం అవుతోంది. ప్రమోషన్స్  వీర లెవల్ లో చేస్తున్నారు. దర్శకుడు, అంజలి తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా పలు మీడియా ఛానళ్ళలో ఇంటర్వ్యూస్ ఇస్తూ వకీల్ సాబ్ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన సమయాన్ని ఇప్పుడు ఎక్కువగా వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ కోసమే కేటాయిస్తున్నాడు. దిల్ రాజు సినిమా యూనిట్ సభ్యులతో వీలైనంతగా జనాలలోకి తీసుకు వెళుతున్నాడు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 9న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

vakeel-saab-has given hundreds of screens...this is a record
vakeel-saab-has given hundreds of screens…this is a record

ఈ క్రమంలో ఇప్పటికే అమెరికాలో వకీల్ సాబ్ బుకింగ్స్ మొదలైయ్యాయి. రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ అవుతోందట. అంతేకాదు అక్కడ ఇంతక ముందెన్నడు లేని విధంగా 700 స్క్రీన్స్ లో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కాబోతుండటం గొప్ప విశేషం. మూడేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా 500 స్క్రీన్స్ లో ప్రదర్శించారు. అప్పట్లో ఇదొక రికార్డ్ గా చెప్పుకున్నారు. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో వకీల్ సాబ్ సినిమా విదేశాలలో ప్రదర్శించనున్నారు.

Vakeel saab : ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ అయినా కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు..పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ కి తగ్గట్టు కథలో కమర్షియల్ అంశాలను చాలానే జోడించాడు దర్శకుడు వేణు శ్రీరాం. ఫైట్స్..సాంగ్స్…వంటి ఎలిమెంట్స్ కోసం ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నే క్రియేట్ చేశాడు. శృతి హాసన్ పవన్ కళ్యాణ్ కి జంటగా గెస్ట్ రోల్ లో కనిపించబోతోంది. యంగ్ బ్యూటీ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ తో పాటు ప్రకాష్ రాజ్..సీనియర్ నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement