VAKEEL SAAB: వకీల్ సాబ్ ప్ర‌భంజ‌నం.. థియేటర్ల దగ్గర బారులు తీరిన అభిమానులు

VAKEEL SAAB పవన్ కళ్యాణ్.. ఈ పేరే ఒక ప్రభంజనం. అభిమానుల గుండెల్లో చెదరని రూపం. అంతులేని అభిమానంతో చూపించే ఆధరణ. అందుకే ప్రతిఒక్క అభిమానికి ఆయనే దేవుడు. అలాంటి అభిమానులకు ఎట్టకేలకు.. సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత ఓ పెద్ద పండుగ లాంటి రోజు రానే వచ్చింది. అదే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ రోజు. దాదాపు 3 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద తన అభిమానుల్ని అలరించబోతున్నారు. అది కూడా లక్షలాది మందికి నిజమైన వేడుకే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈరోజు ఉదయాన్నే బెనిఫిట్ షోతో విడుదలయిన వకీల్ సాబ్ సినిమా గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ మానియాతో అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. వకీల్ సాబ్ సినిమా రిలీజైన ప్రతి థియేటర్ దగ్గర పవన్ అభిమానులు బారులు తీరారు. సిల్వర్ స్క్రీన్ పై తన అభిమాన హీరోని చూడాలన్న ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఒకపక్క రోజురోజుకి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోనూ సినిమా థియేటర్స్ దగ్గర దృశ్యం కన్నులపండుగగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ టికెట్లు కూడా నెక్ట్స్ మూడు, నాలుగు రోజుల వరకు అమ్ముడుపోయాయి.

చిన్న థియేటర్స్ దగ్గర కూడా టిక్కెట్ల కోసం తెల్లవారుజామున నుండే కుర్రాళ్ళు వేచి చూడడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. దీంతో అర్థమవుతుంది పవర్ స్టార్ క్రేజ్ ఏంటో అనేది. పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు కాదు. మరిన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా.. అభిమానుల్లో ఇంతే క్రేజ్ ఉంటుంది.వకీల్ సాబ్ సినిమాని హిందీ సినిమా పింక్ కు రీమేక్ గా తెరకెక్కించారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. శృతిహాసన్, పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మించారు. తమన్ ఎస్ఎస్ పవన్ కళ్యాణ్ సినిమాకి మొట్ట మొదటిసారి సంగీతం అందించారు.

Advertisement