Vakeel Saab: జ‌బ‌ర్ధ‌స్త్ స్టేజ్‌పై వ‌కీల్ సాబ్ సూప‌ర్ ఉమెన్ సంద‌డి..!

Vakeel Saab: చిన్న ఆర్టిస్టుల‌కి జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం మంచి ప్లాట్‌ఫాంలా మారింది. సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ పోషించే వారు కూడా ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్‌లో సంద‌డి చేస్తూనే ఉన్నారు అయితే వ‌కీల్ సాబ్ సినిమాతో సూప‌ర్ ఉమెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న లిరిష ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ స్టేజ్ పై ప్ర‌త్య‌క్షం అయింది. సీరియ‌ల్స్‌లో విల‌న్స్ పాత్ర‌లు పోషించే ఈమెకు వ‌కీల్ సాబ్ చిత్రంతో బాగా గుర్తింపు రావ‌డంతో ఇప్పుడు ఆమెను జ‌బ‌ర్ధ‌స్త్‌కి కూడా ఆహ్వానించారు.

Vakeel Saab

వకీల్ సాబ్ సినిమా చూసిన వాళ్ల‌కు సూప‌ర్ ఉమెన్ అంటే లిరిష ఠ‌క్కున గుర్తొస్తుంది. కోర్ట్ సీన్‌లో ప‌వ‌న్‌..లిరిష‌కు మ‌ధ్య ఉండే కొద్ది సేపు డైలాగులు బాగా పేలాయి. థియేటర్స్‌లో ఈ సీన్ వచ్చినపుడు మామూలు ఈలలు కాదు.. పవన్ కామెడీ టైమింగ్ చూసి ఫ్యాన్స్ కడుపులు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. వ‌కీల్ సాబ్‌లో ఈ సీన్ మాత్రం బాగా పేలింది.

జెట్ స్పీడ్‌తో వ‌చ్చాన‌ని చాలా సీరియస్‌గా చెప్పిన లిరిష‌కు త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చాడు ప‌వ‌న్. వీరిద్ద‌రి మ‌ధ్య సాగిన డైలాగ్స్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అల్వాల్ నుంచి మొయినాబాద్‌కు సిర్ఫ్ 15 మినిట్ మే వచ్చిండ్రామ్మా మీరు.. సూపర్ ఉమెన్ అంటూ కోర్టులో ప్రశ్నిస్తాడు పవన్. దానికి ఆమె ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్‌లో వచ్చిన సర్ అని చెప్తుంది.

Vakeel Saab

నిజానికి ఒరిజినల్ స్క్రిప్టులో ఈ సీన్ అంతా లేదు. అక్కడ సూపర్ ఉమెన్ అనే డైలాగ్ లేదు. కానీ పవన్ ఇంకా ఏదో కావాలని.. ఆ సీన్‌లో డైలాగ్ యాడ్ చేసారని చెప్పింది లిరిష. ప‌వ‌న్ సొంత స్క్రిప్ట్ వ‌ల‌న ఆ డైలాగ్ అంత పేలింద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది లిరిష‌. ప్ర‌స్తుతం ఆమెను అంద‌రు సూప‌ర్ ఉమెన్ అని పిలుస్తున్నారని కూడా స్ప‌ష్టం చేసింది.

చిరంజీవితో కూడా నటించింది లిరిష. 15 ఏళ్ల కింద వచ్చిన స్టాలిన్ సినిమాలో సునీల్‌ను పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటించింది ఈమె. ఆ తర్వాత చాలా సినిమాలు, సీరియల్స్ చేసినా కూడా రాని గుర్తింపు ఒక్క సూపర్ ఉమెన్ పాత్రతో వచ్చేసింది.దీంతో జ‌బ‌ర్ధ‌స్త్ స్టేజ్‌పై ప‌ర్‌ఫార్మెన్స్ చేసే అవ‌కాశం ద‌క్క‌డంతో రెచ్చిపోయింది. 15 నిమిషాలలో వెళ్లిపోయే సూపర్ ఉమెన్‌రా నేను అంటూ రాకెట్ రాఘవ స్కిట్‌లో అదిరిపోయే పంచ్‌ల‌తో న‌వ్వించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.