VAKEEL SAAB: వ‌కీల్ సాబ్ రికార్డ్‌ల ప్ర‌భంజ‌నం.. అంద‌రి హీరోల‌కు షాక్

బాక్సాఫీస్ రికార్డుల రారాజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. వ‌కీల్ సాబ్ చిత్రంతో వెండితెర రీ ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. హిందీలో మంచి విజ‌యం సాధించిన పింక్ రీమేక్‌గా వ‌కీల్ సాబ్‌ను రూపొందించాడు శ్రీరామ్ వేణు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజర్స్, ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచ‌డ‌మే కాకుండా మూవీకి వెళ్లేందుకు చాలా ఆస‌క్తిని పెంచింది. అయితే ఏప్రిల్ 9న విడుద‌ల కానున్న వ‌కీల్ సాబ్ చిత్రం రిలీజ్‌కు ముందే ప‌లు రికార్డులు తిర‌గ‌రాస్తుండడంతో ప్ర‌తి ఒక్క‌రు కంగుతింటున్నారు.

వకీల్ సాబ్ సినిమా ఆకాశమే హద్దుగా రిలీజ్ అవుతుంది దాదాపు 2000 థియేటర్స్ లో విడుదలవుతున్న వకీల్ సాబ్ తొలిరోజు అన్నిచోట్లా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది. అన్ని థియేట‌ర్స్‌లో వీలైన‌న్ని షోస్ వేయాల‌ని ఇప్ప‌టికే యాజ‌మాన్యాలు భావించాయి. ఇక హైదరాబాద్‌లో ఉన్న భారీ మల్టీప్లెక్సులలో ఒక‌టైన‌ మహేష్ బాబు AMB లోను వ‌కీల్ సాబ్ సినిమాను దింపుతున్నారు. దీంతో 27 షోలు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. మూడు రోజుల ముందే వ‌కీల్ సాబ్ కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్స్ బుకింగ్ వేట సాగించారు అభిమానులు. ఇప్పుడు 27 రోజుల వ‌ర‌కు ఒక్కటంటే ఒక్క టిక్కెట్ కూడా ఏఎంబీలో లేక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.

మ‌హేష్ బాబు హీరోగా రూపొందిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర రిలీజ్ స‌మ‌యంలోను చాలానే హౌజ్ ఫుల్ అయ్యాయి. కాని ఈ రేంజ్‌లో మాత్రం కాలేద‌నే చెప్పాలి. వ‌కీల్ సాబ్ ఆగ‌మ‌నం భారీగా ఉండ‌గా, ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ని తిర‌గ‌రాయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. వ‌కీల్ సాబ్ సినిమా క‌నుక మంచి విజ‌యం సాధిస్తే ప్ర‌స్తుతం ప‌వ‌న్ న‌టిస్తున్న హరిహ‌ర వీర‌మ‌ల్లు, అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్, హ‌రీష్ శంక‌ర్ సినిమాల‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. వ‌కీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు,బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించగా ఇందులో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టించిన విష‌యం విదిత‌మే.

Advertisement