Vakeel Saab: వ‌కీల్ సాబ్ మానియా మ‌రోసారి ప్రూవ్ అయింది..!

Vakeel Saab: అజ్ఞాత‌వాసి చిత్రం త‌ర్వాత రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వన్ క‌ళ్యాణ్ ఇక సినిమాలు చేయ‌న‌ని ప్ర‌క‌టించాడు. దాంతో అభిమానుల‌లో ఏదో తెలియ‌ని బాధ క‌నిపించింది. త‌మ అభిమాన న‌టుడిని ఇక వెండితెర‌పై చూడ‌లేమో అని భావోద్వేగానికి గుర‌య్యారు. వీలున్న‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్ సినిమాల‌లోకి రావాలంటూ అభిమానులే కాదు త‌న ఫ్యామిలీ స‌భ్యులు, శ్రేయోభిలాషులు ప‌ట్టుబ‌ట్టారు. అంద‌రి కోరిక మేర‌కు ప‌వ‌న్ తిరిగి సినిమాల‌లోకి వ‌చ్చారు. హిందీలో తెర‌కెక్కిన పింక్ చిత్రానికి రీమేక్‌గా వ‌కీల్ సాబ్ అనే మూవీ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుద‌ల కాగా, తొలి వారం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించింది. క‌రోనా ఎఫెక్ట్ లేక‌పోతే పాత రికార్డుల‌ని చెరిపేసి ఉండేది ఈ చిత్రం.

Vakeel Saab

హిందీలో పింక్ పేరుతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని త‌మిళంలో త‌ల అజిత్ “నెర్కొండ పారవై” గా రీమేక్ చేశాడు. అక్క‌డ కూడా ఈ మూవీ మంచి విజ‌యం సాధించింది. ఇక తెలుగు నేటివిటీకి అనుగుణంగా ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ వ‌కీల్ సాబ్ మూవీని తెర‌కెక్కించాడు. అంచ‌నాల‌ను మించి ఈ సినిమా ఉండ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇప్ప‌టికే ప‌లు రికార్డ్స్ క్రియేట్ చేసిన వ‌కీల్ సాబ్ తాజాగా హిందీ మరియు తమిళ్ వెర్షన్స్ క‌న్నా బెట‌ర్ అని నిరూపించుకుంది. ఐఎండిబి లో ఈ మూడు వ‌ర్షెన్స్‌లో కెల్లా వకీల్ సాబ్ నే బాగుందని సినీ ప్రేమికులు తమ ఫీడ్ బ్యాక్ ఇవ్వగా ఈ చిత్రం హైయెస్ట్ రేటెడ్ చిత్రంగా నిలిచింది. దీంతో వ‌కీల్ సాబ్ ఖాతాలో మ‌రో రికార్డ్ వ‌చ్చి చేరింది.

Vakeel Saab

అనుకోకుండా చిక్కుల్లో పడ్డ ముగ్గురు అమ్మాయిలను కాపాడే ఓ లాయర్‌ కథే వకీల్ సాబ్ కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారన్నది ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న నయా అప్‌డేట్‌. మరో సెన్సేషనల్ పాయింట్‌ నేపథ్యంలో పవర్ ఫుల్‌ లాయర్‌గా పవన్‌ను ప్రజెంట్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని టాక్. అయితే దీనిపై ఎలాంటి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న లేదు. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, నివేతా థామస్ మరియు అంజలీలు కీలక పాత్రల్లో నటించగా దిల్ రాజు – శిరీష్ లు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.