PAWAN KALYAN: ప‌వన్ క‌ళ్యాణ్ అరాచ‌కం.. 50 నిమిషాల కోసం 52 కోట్లు డిమాండ్ చేసిన వ‌కీల్ సాబ్

PAWAN KALYAN ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్‌కు అభిమానుల‌లో ఉన్న క్రేజ్ ఏ పాటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొంద‌రు అభిమానులు అయితే ఆయ‌న పేరు చెబితే పూనకం వ‌చ్చినట్టు ఊగిపోతుంటారు. రాజ‌కీయాల వ‌ల‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడు సంవ‌త్స‌రాల పాటు వెండితెర‌కు దూరంగా ఉండే స‌రికి అభిమానులు నీర‌సించిపోయారు. మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాలు చేయాల‌ని కోరారు. అభిమానుల కోరిక ఫ‌లించి ప‌వన్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ చిత్రంతో తిరిగి సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. హింద‌లో సూప‌ర్ హిట్టైన పింక్ రీమేక్‌గా వ‌కీల్ సాబ్ చిత్రం రూపొంద‌గా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుద‌ల చేయ‌బోతున్నారు.

రిలీజ్‌కు ముందే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ చిత్రం రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప‌లు వార్త‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. తెలుగు నేటివిటీకి అనుగుణంగా వ‌కీల్ సాబ్ చిత్రాన్ని వేణు శ్రీరామ్ రూపొందించ‌గా, ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ 52 నిమిషాలు మాత్ర‌మే క‌నిపిస్తార‌ట‌. రెండున్న‌ర గంటల సినిమాలో ప‌వ‌న్ కొద్ది సేపు క‌నిపించిన ఆయ‌న పాత్ర అభిమానుల ఆనందాన్ని పీక్స్ స్టేజ్‌కు తీసుకెళ్ల‌డం ఖాయం అని అంటున్నారు. అయితే ఈ 52 నిమిషాల‌కే ప‌వ‌న్ త‌న రెమ్యున‌రేష‌న్‌గా 50 కోట్లు తీసుకున్నాడ‌ని ఇండ‌స్ట్రీ టాక్. ఇదే నిజ‌మైతే ప‌వ‌న్ ఒక్క నిమిషం కోసం కోటి రూపాయ‌లు తీసుకున్న‌ట్టు.

50 నిమిషాలకు 50 కోట్లు తీసుకుంటున్నాడని తెలిసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ ద‌టీజ్ ప‌వ‌ర్ స్టార్ అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌కీల్ సాబ్ బిజినెస్ 120 కోట్లకు పైగానే దాటింది. సినిమా రిలీజ్ త‌ర్వాత మ‌రింత పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. గోపాల గోపాల సినిమా కోసం 40 నిమిషాల పాటు కనిపించి అల‌రించిన విష‌యం తెలిసిందే. వెంక‌టేష్‌తో క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన మ్యాజిక్‌కు ప్రేక్ష‌కులు ఫుల్ ఫిదా అయ్యారు. మ‌రి ఇప్పుడు 50 నిమిషాల నిడివితో ప‌వ‌న్ ఎంత ఎంట‌ర్‌టైన్ చేస్తాడో చూడాలి.

Advertisement