VAKEEL SAAB: మ‌రోసారి వ‌కీల్ సాబ్ కాంబినేష‌న్.. ఇంట్రెస్టింగ్‌గా మారిన వార్త‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెర‌కెక్కించ‌గా, దిల్ రాజు,బోని క‌పూర్ సంయుక్తంగా నిర్మించారు. అన‌న్య నాగ‌ళ్ల, నివేదా థామ‌స్, అంజ‌లి, ప్ర‌కాశ్ రాజ్, శృతిహాసన్ కీల‌క పాత్ర‌లు పోషించారు.అయితే వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ రీ ఎంట్రీ చేస్తున్నాడ‌నే స‌రికి అంద‌రు షాక్ అయ్యారు. పెద్దగా హిట్స్ పొంద‌ని ఈ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ తో సినిమా ఎలా చేస్తాడ‌ని అంతా అనుకున్నారు.

అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ వ‌కీల్ సాబ్ చిత్రం పెద్ద స‌క్సెస్ సాధించేలా కృషి చేశాడు. వేణు శ్రీరామ్ కృషికి ఫుల్ ఇంప్రెస్ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో క‌థ‌ను సిద్దం చేయ‌మ‌ని ద‌ర్శ‌కుడికి చెప్పాడ‌ట‌. ఈ క్ర‌మంలో వేణు శ్రీరామ్ సైతం పవన్ కళ్యాణ్ కోసం మరొక కథను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వ‌ర‌లోనే ఈ క‌థ‌ను ప‌వ‌న్‌కు వినిపించి ఆయ‌న డేట్స్ తీసుకోనున్నాడ‌ట వేణు శ్రీరామ్.ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రో వైపు దిల్ రాజు, వేణు శ్రీరామ్ కాంబినేష‌న్‌లో ఐకాన్ అనే చిత్రం రూపొంద‌నుండ‌గా, ఈ చిత్రంలో బ‌న్నీ న‌టిస్తాడా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది.

Advertisement